Saturday, November 23, 2024
HomeతెలంగాణThorruru: కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు..మినీ ట్యాంక్ బండ్ కల నెరవేరేనా?

Thorruru: కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు..మినీ ట్యాంక్ బండ్ కల నెరవేరేనా?

ఉత్సాహంగా ఎదురుచూస్తున్న స్థానికులు

తెలంగాణ రాష్ట్రంలో సందర్శకులను ఆకర్షించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా జలశయాలను సుందరంగా తీర్చిదిద్దాలని గత బియారెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బారస ప్రభుత్వం చెరువుకట్టలను మినీ ట్యాంక్ బాండ్ గా, తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన భారాస జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో ప్రధానమైన చెరువుల వద్ద సుందరీకరణ పనులు చేయాలని తలచింది. హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ తరహాలో ప్రతి నియోజకవర్గంలోని ఒక చెరువులను మినీ ట్యాంక్బండ్గా రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.కానీ చెరువు కట్టలపై పచ్చదనం కనిపించేలా పచ్చని గడ్డిని పెంచడంతో పాటు, మినీగార్డెన్లో పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు నాటి ప్రజలు ఆహ్లాదం పొందేలా చూడాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. కట్టకు రెండువైపులా వాకింగ్ ట్రాక్, వీధి దీపాలు, బెంచీలు వేసేందుకు 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు పురపాలక సంఘంలో మినీ ట్యాంక్లను మంజూరు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ పనులను పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన సుందరీకరణ పనులు మధ్యలోనే నిలిచిపోగా ప్రజల్లో నిరాశ నెలకొంది.

- Advertisement -

తొర్రూరు పట్టణ పెద్ద చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మించేందుకు 2018-19లో రూ. 3.60 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధుల్లో రూ. 2.19 కోట్లతో వంతెన కోసం దిమ్మెల నిర్మాణం, కట్ట మరమ్మతులు చేశారు. మిగిలిన పనులను గుత్తేదారుకు అప్పజెప్పడంతో అవి అక్కడే నిలిపివేశారు. అవి పూర్తి కావాలంటే అదనంగా నిధులు కావాలని రూ. 17.08 కోట్లు అంచనావేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఆ పనులకు ఆమోదం లభించకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.కాగా పూర్తైనపనులు కూడా నిరుపయోగంగా మారాయి.ఇంతలో ఎన్నికలు సమిపించడంలో ప్రజల్లో కొత్త ఆశలు నెలువెత్తయి…నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైన తొర్రూరులో మిని ట్యాంక్ బండ్ ను నిర్మించాలని,స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధిక భారీ వర్షాల కారణంగా తొర్రూరు నుండి నర్సంపేట ప్రధాన రహదారిలో ఉన్న అకేరు వాగు మరియు పాలేరు వాగులు వాహనదారులను పోనివ్వకుండా…రవాణా నిలిపివేయడం జరుగుతుంది…కావున అట్టి వాగులపై వంతెనలు నిర్మించాలని…100 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు వైద్య సదుపాయాలు సకాలంలో అందించే సామర్థ్యం తేవాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త ప్రభుత్వం నిలిపివెయ్యమన్నది
తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో చెరువులను మినీ ట్యాంక్ బండ్ చేయాలని గత ప్రభుత్వం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో చెరువులు చేయాలని ప్రతిపాదనలు చేసింది కానీ కొత్త ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్ ను నిలిపివేయాలని చెప్పింది. కానీ నేను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి వినతి చేశాము. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News