హైదరాబాద్ చివారు ప్రాతం చేవెళ్ళ మండల కేంద్రంలో గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీస్ లు చేవెళ్ళ పోలీస్ లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో 64 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి బెంగళూరు- మహారాష్ట్ర అంతరాష్ట్ర లింక్ రోడ్డు శంకర్పల్లి చౌరస్తాలో గంజాయి సంచులతో వ్యక్తులు ఉన్నారన్న విశ్వాసనీయ పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటి చేవెళ్ల పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఒక మహిళా సహా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి దగ్గర 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహిళాతో సహా మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. సిఆర్ నెం :64/2024 యు /ఎస్ 8సి ఆర్ /డబ్ల్యూ 20(బి )2.( 20)సి సెక్షన్ 29 ఆఫ్ ఎన్ డిపిఎస్ యాక్ట్ 1985 (నోరకోటిక్ డ్రగ్స్ సైకాట్రాఫిక్ సబ్స్టెన్స్ ) కేసు నమోదు చేశారు. దాదాపు ఆరు నెలల కాలంలో రాజేంద్రనగర్ ఎస్ఓటి చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ లో చేవెళ్ళలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది.