Monday, May 20, 2024
Homeహెల్త్Snacks for skin glow: చర్మం సొగసును పెంచే స్నాక్

Snacks for skin glow: చర్మం సొగసును పెంచే స్నాక్

యాంటీ ఏజింగ్ స్నాక్స్ ఎంజాయ్ చేయండి

గుడ్ చెన్నా స్నాక్…విన్నారా ఎప్పుడైనా..మన బామ్మలు, అమ్మమ్మలు వండిపెట్టే తీయటి వంటకం ఇది. అదే నేడు మ్రదువువైన చర్మానికి కొత్త బ్యూటీ సీక్రెట్ అయింది. ఈ స్నాక్ తింటే ఆరోగ్యానికే కాదు మీ చర్మాన్ని కూడా నిగనిగలాడేలా చేస్తుంది. ఈ హెల్దీ స్నాక్ ముఖంపై ఉండే ముడతలను పోగొట్టడమే కాదు ఫైన్ లైన్స్ జాడ లేకుండా చేస్తుందంటున్నారు పోషకాహారనిపుణులు కూడా. అంతేకాదు మీ మేనికి ఆరోగ్యవంతమైన మెరుపును ఇస్తుందని కూడా వీరు చెప్తున్నారు. బెల్లం, వేగించిన శెనగలను కలిపి ఈ స్నాక్ చేస్తారు. ఎప్పటి నుంచో మన పెద్దవాళ్లు చేస్తూ వస్తున్న పూర్తి సంప్రదాయ పిండివంటకం ఇది. మనకు పేకేజ్డ్, ప్రోసెస్డ్ ఫుడ్స్ సెగ తగలకముందు ఈ స్నాక్ ను పిన్న పెద్ద అందరూ తరచూ తినేవారు. ఆ వంటకం కాస్త ఇపుడు చర్మం బ్యూటీ సీక్రెట్ గా వైరల్ కావడం విశేషం.

- Advertisement -

ఈ స్నాక్ లో ఉపయోగించే శెనగల నిండా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు కూడా వీటిల్లో అత్యధికంగా ఉంటాయి. వర్కవుట్లు చేసే ముందు గర్ చెన్నా స్నాక్ తింటే ఒంటికి ఎంతో మంచిదని ఫిట్నెస్ నిపుణులు కూడా అంటున్నారు. బెల్లం, శెగనలు అందించే ఎనర్జీ, పోషకపదార్థాలు ఎన్నో అని వీళ్లు చెపుతున్నారు. గర్ చెన్నా స్నాక్ ను అన్నం తిన్నతర్వాత తింటే చాలా మంచిదని కూడా సూచిస్తున్నారు. గర్ చెన్నా ఆరోగ్యానికే కాదు ముందే చెప్పుకున్నట్టు చర్మ సంరక్షణకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

శెనగల్లో యాంటిఏజింగ్ సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు శెనగల్లో సహజసిద్ధమైన గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి అవసరమైన ప్రయోజనాలను తీరిస్తుంది. ముఖంపై, వంటిపై ఫైన్ లైన్స్ ను పోగొట్టడమే కాదు ముడతలను సైతం అద్రుశ్యం చేస్తుంది. ఏజింగ్ స్పాట్స్ ను పోగొడుతుంది. స్కిన్ టోన్ అసమానత్వాలను పోగొడుతుంది. శెనగలతో చేసిన వాటిని తినడం వల్ల వాటిల్లోని మెగ్నీషియం చర్మంపై పడిన ముడతలను తగ్గిస్తుంది. ఉండే ఫైన్ లైన్స్ పోగొడుతుంది. ఫలితంగా చర్మం డల్నెస్ పోయి కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. గర్ చెన్నా స్నాక్ తో పొందే ఆరోగ్య లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది నిజంగా సూపర్ ఫుడ్. శెనగల్లో జింకు, సెలినియం లాంటి ఖనిజాలు సమ్రుద్ధిగా ఉన్నాయి.

ఇవి ఫ్రీ రాడికల్ డ్యామేజిని నిరోధిస్తాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. బెల్లం, శెనగలతో చేసే ఈ స్నాక్ కండరాలను బలంగా ఉంచుతుంది. వీటిల్లోని ప్రొటీన్లు
ఎముకలను ద్రుఢంగా చేస్తాయి. బెల్లంలో పొటాషియం బాగా ఉంటుంది. ఇది కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. నిత్యం గర్ చెన్నాను ఉపయోగించడం వల్ల దంతక్షయాన్ని కూడా నివారించవచ్చు. శెనగల్లో అధిక ప్రమాణాల్లో ఫాస్ఫరస్ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. శెనగల్లో ఫొలేట్, బి6 సమ్రుద్ధిగా ఉంటాయి. అందుకే గర్భిణీలు తినాల్సిన ఆరోగ్యకరమైన స్నాక్ ఇదంటున్నారు డైటీషియన్లు సైతం. బెల్లం కలిపి చేసే గర్ చెన్నా స్నాక్ చేయడం చాలా సులువే.

ఒక కప్పు బెల్లం తీసుకుని దానిని ప్యాన్ లో వేయాలి. దాన్ని స్టవ్ మీద పెట్టాలి. బెల్లం ఆ వేడికి మెల్లగా కరగడం మొదలవుతుంది. అప్పుడు అందులో ఒకటిన్నర కప్పు రోస్టెడ్ శెనగలు వేసి మెలమెల్లగా కలుపుతుండాలి. అరకప్పు నల్ల నువ్వులు, తెల్లనువ్వులను కూడా తీసుకుని అందులో వేసి బాగా కలపాలి. అవి కాస్తా రోస్టెడ్ శెనగలకు చేరి గర్ చెన్నా స్నాక్ రుచి మరింత అదురుతుంది. ఈ చెన్నా బెల్లం
మిక్స్ డు స్నాక్ ను ఎంజాయ్ చేయండి. దీంతో మీ ఆరోగ్యం బాగుంటుంది. సొగసైన, మ్రుదువైన, ఆరోగ్యవంతమైన చర్మం మీ సొంతమవుతుంది. చర్మం తొందరగా ముడతలు పడదు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News