ఇండస్ కెమ్ కంపెనీతో తమ ఊరికి ముప్పుందని, కంపెనీని తక్షణం మూసేయాలంటూ స్థానిక గ్రామస్థులు డిమాండ్ కు దిగారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ సమీపంలో ఉన్న ఇండస్ కెమ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సీపీఎం, ఎంఎస్పీ పార్టీ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా కెమికల్ ఫ్యాక్టరీలకు పర్మిషన్లు ఇస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. ఇండస్ కెమ్ ఫ్యాక్టరీ వదిలే విష వ్యర్థాల వల్ల గుంతబస్ పల్లి గ్రామంలో నీరు కలుషితమై ప్రజలు, పశువులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని బాధితులు మండిపడుతున్నారు.
Tandur: ఇండస్ కెమ్ కంపెనీను ముసేయాల్సిందే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES