Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: పోలీసులమని దారి దోపిడీ చేశారు

Chegunta: పోలీసులమని దారి దోపిడీ చేశారు

టీచరును దోచుకున్న దొంగలు

చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో గల బైపాస్ వద్ద విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు దొడ్లే రామచంద్రం తన వ్యవసాయ పొలం నుంచి వస్తున్నప్పుడు బైపాస్ బ్రిడ్జి వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి.. మేం పోలీసులమని చెప్పి బండిని ఆపారు. వెనుక నుండి మరో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి, వెనక నుండి గట్టిగా పట్టుకుని అతనికి కత్తి చూపించి అతని చేతికున్న రెండు ఉంగరాలను తీసుకెళ్లారు. అతని మెడలో బంగారు గొలుసు ఉందేమోనని గొంతును గట్టిగా పట్టుకున్నారు. మొత్తం రెండున్నర తులాల బంగారం, సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఉంగరాలను లాక్కెళ్ళినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో బాధితుడు చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దారి దోపిడికి పాల్పడిన నిందితుల ఆనవాళ్లు గురించి, సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పి రామయంపేట్ సిఐతో పాటు పోలీసుల అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని, దోపిడీ జరిగిన ఘటనలను సమీక్షించారు. ఇంతకు ముందు శుక్రవారం రోజు ఇంటి ముందు ఉన్న కారు నుంచి 5 లక్షల రూపాయలు దోపిడి జరిగిన సంఘటన మరువక ముందే పోలీసుల పేరు చెప్పి ఇలా జరగడంతో మండల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News