Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి

Garla: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి

ఇష్టంగా చదివి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలన్న ఎస్ఐ

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ పేర్కొన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో సోమవారం 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం హెచ్ఎం రత్నకుమార్ అధ్యక్షత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఐ జీనత్ కుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం విద్యార్థులు చదివి ఉత్తీర్ణత సాధించాలని నెగిటివ్ ఆలోచనలను వదిలి, విద్యార్థులు పరీక్షల పట్ల సానుకూల వైఖరి పెంపొందించుకోవాలని, హాల్ టికెట్స్, పెన్స్, పరీక్ష పాడ్ లతో సంసిద్ధులై పరీక్షలకు విద్యార్థులు అర్ధగంట ముందుగా చేరుకోవాలని, నూటికి నూరు శాతం ఫలితంగా ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో హెచ్ఎం గా పనిచేసిన పుష్ప కుమారిని, పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలోఅప్పయ్య టిఎస్ టిటిఎఫ్ నాయకులు శివ పాఠశాల సిబ్బంది పి వెంకట్ రెడ్డి. మాటేటి వెంకటేశ్వరరావు ఎం మంజుల రాంప్రసాద్ రేణుక స్వప్న శోభ రాణి విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News