Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభPathan Fever: ఒక్క రోజులోనే 60 షోలు..రిలీజ్ కు ముందే పఠాన్ రికార్డులు

Pathan Fever: ఒక్క రోజులోనే 60 షోలు..రిలీజ్ కు ముందే పఠాన్ రికార్డులు

60కి పైగా షోలు..అది కూడా ఒక్కరోజులోనే .. మీరు నమ్మలేకపోతున్నారా! సినీపోలీస్ థియేటర్స్ లో టికెట్లు దొరకట్లేదు అందుకే వేళాపాళతో సంబంధం లేకుండా టికెట్లకు డిమాండ్ వచ్చి పడుతుంటే సినీపోలీస్ యాజమాన్యం షోస్ ప్లాన్ చేస్తోంది. తెల్లవారుజాము మొదలు అర్ధరాత్రైనా షోలు వేసుకుంటూ పోవటమే పని. ఇదంతా పఠాన్ సినిమాకున్న క్రేజ్.

- Advertisement -

పూనేలోని సినీపోలీస్ సీజన్స్ మాల్ లోని మల్టీప్లెక్స్ లో 15 స్క్రీన్లున్నాయి. వీటన్నింటిలో పఠాన్ రిలీజింగ్ డే 62 షోలు వేస్తున్నారు. వీటిలో మళ్లీ 46 షోస్ నార్మల్ స్క్రీన్స్ ఉండగా.. 10 స్క్రీన్లు మాత్రం లగ్జురియస్ వీఐపీ స్క్రీన్లు కావటం హైలైట్. మార్నింగ్ 6 గంటలకే 4డీఎక్స్ స్క్రీన్ లో పఠాన్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

ముంబై సమీపంలోని థానేలోని సినీపోలీస్ వివియానా మాల్ లో 14 స్క్రీనల్లో పఠాన్ ప్లే చేస్తున్నారు. 7 షోలు ఐమ్యాక్స్ స్క్రీన్స్ పై ప్లే చేస్తే 15 షోస్ వీఐపీ స్క్రీన్స్ పైన రిలీజ్ చేస్తుండటం విశేషం. మిగతా 37 షోలు నార్మల్ స్క్రీన్స్ పై ప్లే చేస్తారు. సింగిల్ డేలో 59 షోలు పఠాన్ నడిపిస్తున్నారు. ఇదంతా అతి పెద్ద రికార్డ్ గా మిగిలిపోవటం ఖాయమని ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

ఇలా పదేపదే సినిమాను ప్లే చేస్తూ పోతున్న కారణంగా షోకు షోకు మధ్యలో కేవలం 15 నిమిషాల వ్యవధి గ్యాప్ ఉంటుందని సినీపోలీస్ వెల్లడించింది. జనవరి 25, 26 తేదీల్లో పఠాన్ సినిమాకు 100శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని సినిమా థియేటర్ల యాజమాన్యాలు వెల్లడిస్తున్నారు.

రికార్డులు తిరగరాస్తున్న పఠాన్ సినిమాకు మంచి బజ్ వచ్చింది. దీంతో కనివినీ ఎరుగని రీతిలో పఠాన్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోతున్నాయి. దాదాపు అన్ని ఊళ్లలోనూ ఇదే పరిస్థితిగా కనిపిస్తోంది. రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ కొల్లగొడుతున్న పఠాన్ సినిమా రిలీజ్ అయ్యాక మరిన్ని సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భారీగా అంచనాలు వేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందని సినీ పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News