కొచ్చికి చెందిన కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మొట్టమొదటి సారి విద్యార్థినులకు మెనుస్ట్రువల్ లీవ్ ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు కేరళలోని మొత్తం 14 యూనివర్సిటీల్లోనూ ఈ విధానాన్ని అనుసరించనున్నారు. దీంతో కేరళ యూనివర్సిటీల్లో ప్రతి సెమిస్టర్ కు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా మారింది. అంతేకాదు 18 ఏళ్లు పైబడ్డ విద్యార్థినులకు రెండు నెలల మెటర్నిటీ లీవ్ కు ఇస్తోంది కేరళ యూనివర్సిటీ. అంతేకాదు అమ్మాయిలందరికీ కాలేజీ హాజరులో 2 శాతం మినహాయింపు కూడా ఇస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలు చదువుకునేందుకు ఇది ప్రోత్సాహం ఇచ్చే వాతావరణాన్ని సృష్టించటమే దీని వెనకున్న ప్రధాన ఉద్దేశం.
సీయూఎస్ఏటీ లో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న నమితా జార్జ్ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ ఈ విప్లవాత్మక నిర్ణయం కోసం పోరాడి విజయం సాధించారు. సీయూఎస్ఏటీ గవర్నింగ్ కౌన్సిల్ ఈమె డిమాండ్ ను అంగీకరించటంతో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో కూడా ఇదే విధానం అవలంభిస్తే మంచిదనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ పై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.