Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్Starbucks: అవ్వ చేతి ఫిల్టర్ కాఫీ..స్టార్ బక్స్ లో

Starbucks: అవ్వ చేతి ఫిల్టర్ కాఫీ..స్టార్ బక్స్ లో

మీరు చదివినది అక్షరాలా నిజమే. ఫిల్టర్ కాఫీ ఇప్పుడు స్టార్ బక్స్ లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఒక కప్పు ఫిల్టర్ కాఫీ ధర ఏకంగా 290 రూపాయలు. అవ్వ (అజ్జి) చేతి కాఫీ అన్న పేరుతో స్టార్ బక్స్ ఇప్పుడు కొత్తగా ఈ ఫిల్టర్ కాఫీని మెనూలో చేర్చింది.

- Advertisement -

ఈమధ్యనే స్టార్ బక్స్ కాఫీ యజమాని బెంగళూరు వచ్చినప్పుడు ఇక్కడి దోశ, ఫిల్టర్ కాఫీ టేస్ట్ కు ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఇలా మెనూలో మార్పు రావటం విశేషం. చూడాలి స్టార్ బక్స్ ఇంకా ఇండియన్ మెనూలో ఎలాంటి మార్పులు చేస్తుందో అంటున్నారు నెటిజన్స్.

ఇక దీనిపై ట్రోలర్స్, మీమర్స్ రెచ్చిపోతున్నారు. బాస్ అవ్వ అప్రూవ్ చేసిన అంటున్నారు కానీ ఎవరి అవ్వో చెప్పలేదని ఒక నెటిజన్ అంటే.. ఓ కప్పు కాఫీకి 300 రూపాయలు తగలేస్తే మా అవ్వ బెల్టు తీసుకుని నన్ను కొట్టేస్తుందంటూ నవ్వులు పూయిస్తున్నాడు. మరో నెటిజన్ అయితే బాస్ 300 రూపాయలకు అర కిలో కంటే ఎక్కువ కాఫీ పొడి వస్తుంది అంటున్నాడు. 300 రూపాయలు పెట్టి ఒక్క కప్పు కాఫీ తాగటం కంటే నెలంతా అయ్యే కాఫీ పొడిని కొని నెలంతా రుచికరమైన ఫిల్టర్ కాఫీ ఇంట్లోనే తాగచ్చంటున్నాడు మరో నెటిజన్. హే మా యింటి దగ్గర అథెంటిక్, సూపర్బ్ టేస్ట్ ఉన్న కాఫీ జస్ట్ 20 రూపాయలకే అమ్ముతారు మీ అందరికీ అడ్రస్ షేర్ చేస్తా మీరు 300 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కట్టి ఒక కాఫీ తాగితే సరిపోతుందా అని మరొకరు. మొత్తానికి స్టార్ట్ బక్స్ ఫిల్టర్ కాఫీ యాడ్ తెగ వైరల్ అవుతోందన్నమాట. ఇండియాలో స్టార్ బక్స్ కాఫీ ఔట్ లెట్స్ ను టాటా కంపెనీ నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News