Saturday, October 5, 2024
HomeతెలంగాణMedaram: తన ఎత్తు బంగారం సమర్పించిన కేంద్ర మంత్రి

Medaram: తన ఎత్తు బంగారం సమర్పించిన కేంద్ర మంత్రి

గిరిజన యూనివర్సిటీ అడ్మిషన్స్ ఈ ఇయర్ నుంచే

ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంత సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని గిరిజన దేవతలను కోరుకున్నానని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేడారంలోని అమ్మవారి గద్దెలకు చేరుకున్న అనంతరం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూర్య స్వాగతం పలకగా కిషన్ రెడ్డి తన ఎత్తు బంగారాన్ని (బెల్లం ) అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం గద్దెల ప్రాంతాన్ని చేరుకొని సారే, చీరే, పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం కేంద్ర గిరిజన శాఖా మంత్రి అర్జున్ ముండా రానున్నారని, అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట కేంద్ర గిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లాలు ఏర్పాటు చేయడం అన్నారు.
ఈ సంవత్సరం నుండే గిరిజన యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రవేశాలు తీసుకోవడం జరుగుతుందని, అత్యధిక సీట్లు స్థానిక గిరిజన బిడ్డలకే చెందుతాయని అన్నారు. గిరిజన యూనివర్సిటీలో తాత్కాలిక సిబ్బందిని నియమించడం జరుగుతుందని, జిల్లా కేంద్రానికి సమీపంలోని జాకారం యూత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తాత్కాలిక భవనం ప్రారంభమవుతుందని తెలిపారు.

- Advertisement -


నూతన యూనివర్సిటీకి సలహాదారుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారి బాధ్యులుగా ఉంటారని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేసి
భవన నిర్మాణం వేగవంతం చేసి పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న మేడారం మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల 14 లక్షలు కేటాయించిందని, రానున్న మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ డాక్టర్ శబరీష్, జిల్లా అధికారులు, బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News