Saturday, October 5, 2024
HomeతెలంగాణMedaram sidelights: మేడారం మహా జాతరలో సైడ్ లైట్స్ ఎన్నో

Medaram sidelights: మేడారం మహా జాతరలో సైడ్ లైట్స్ ఎన్నో

మేడారం గిరిజన కుంభమేళాలో ఎన్ని సేవలో..

అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు…మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తప్పిపోయిన వ్యక్తుల కోసం ప్రత్యేక శిభిరం…4 వేల సిబ్బందితో పటిష్టంగా పారిశుధ్య నిర్వహణ….ఐఏఏస్ అధికారులతో సమక్క సారలమ్మ జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం.

- Advertisement -

తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
సమ్మక్క సారలమ్మ జాతరను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్, కార్మిక శాఖ సంచాలకులు కృష్ణ ఆదిత్య, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, రంగారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.


మేడారం జాతరలో వైద్య శాఖ ద్వారా అందిస్తున్న సేవలను నోడల్ అధికారులు ఆర్వి కర్ణన్, కృష్ణ ఆదిత్య గురువారం స్వయంగా పరిశీలించి భక్తులకు అవసరమైన వైద్య సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహా జాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చే దిశగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

తాడ్వాయి సెక్టార్ అధికారి స్వర్ణలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు నమోదైన 798 తప్పిపోయిన కేసులలో 796 కేసులను పరిష్కరించి, తప్పిపోయిన వ్యక్తులను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మహా జాతర సందర్భంగా 4000 మంది సిబ్బందితో పారిశుధ్య కార్యక్రమాలను కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతున్నది. జాతరలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి కార్మికుల చే వ్యర్థ పదార్థాలు తొలగించే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది.


మేడారం పరిసరాలతో పాటు భక్తుల దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా, అమ్మవారి గద్దెల వద్ద 80 మంది శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగింది. అధికారుల నిరంతర పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News