యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న వ్యక్తిని తలకొండపల్లి పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. తలకొండపల్లి ఎస్సై ఏ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం గత ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాలానగర్ మండలం కొండేడు గ్రామానికి చెందిన మహేష్ తన బైక్ పై తలకొండపల్లి మండలం మీదుగా కడ్తాల్ వైపు వెళ్తుండగా తుమ్మలగుంట తాండ దాటిన తర్వాత అడవి ప్రాంతంలో కడ్తాల్ నుంచి తలకొండపల్లికి వస్తున్న ఒక వాహనం ఢీకొట్టడంతో మహేష్ బైక్ పై నుండి కిందపడి కుడికాలు విరిగినట్లు ఎస్సై తెలిపారు. యాక్సిడెంట్ అయిన మహేష్ ను 108 అంబులెన్స్ సహకారంతో షాద్‌నగర్ లోని శివరాం నాయక్ హాస్పిటల్‌కు తరలించినట్లు బాధితుని తండ్రి తలకొండపల్లి పోలీస్ స్టేషన్లో గత ఆదివారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తలకొండపల్లి ఎస్సై ఏ శ్రీకాంత్ ఆదేశాల మేరకు రంగంల్లోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కొన్ని సీసీ కెమెరాలు పరిశీలించి గురువారం నిందితుడిని నిర్దారించినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన పులదండి హరీష్‌గా గుర్తించినట్లు ఎస్సై ఏ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర వహించిన కానిస్టేబుల్ నిరంజన్, జాషువా లను ఎస్సై ఏ శ్రీకాంత్ అభినందించారు. నిందితుడిని చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై ఏ శ్రీకాంత్ తెలిపారు.
Thalakondapalli: యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న వ్యక్తి అరెస్టు
సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES