Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Lasya Nanditha: షాక్ లో తెలంగాణ నేతలు, లాస్య నందిత మృతితో..

Lasya Nanditha: షాక్ లో తెలంగాణ నేతలు, లాస్య నందిత మృతితో..

దివంగత సాయన్న కుమార్తె లాస్య

తెలంగాణలో రాజకీయ నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దివంగత సాయన్న కుమార్తె లాస్య నందిత కారు ప్రమాదంలో హఠాన్మరణం పాలవ్వడంతో తెలంగాణ లీడర్లంతా షాక్ అయ్యారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరమంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్ని పార్టీల నేతలు, ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.

- Advertisement -

ఇటీవలే ఛలో నల్గొండ ప్రోగ్రాంకు వెళ్లిన లాస్య రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స తీసుకోగా తాజాగా ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. గతేడాది ఫిబ్రవరి 19వ తేదీని సాయన్న మృతి చెందగా ఈ ఏడాది అదే ఫిబ్రవరి నెలలో ఆయన కుమార్తె లాస్య మృతిచెందడం విషాదకరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News