శ్రీశైలం దేవస్థానానికి కొత్తపల్లి సునీల్ దత్ కుటుంబ సభ్యులు, అమెరికా నుంచి వచ్చి బంగారం, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. వీటిలో 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బరువు గల 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బరువుగల బంగారు కంకణం అందజేశారు. అదేవిధంగా (1) 1 కేజీ 25 గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం (2) 865 గ్రాముల బరువు గల ఒక వెండి పళ్ళెం, (3) 550 గ్రాముల బరువుగల వెండి నాగహారతి, (4) 290 గ్రాముల బరువు గల వెండి శక్తి ఆయుధం, (5) 420 గ్రాముల బరువుగల కుక్కుటధ్వజం, (6) 750 గ్రాముల బరువు 5 వెండి గిన్నెలు, (7) 920 గ్రాముల బరువు గంధాక్షత గిన్నె, (8) 190 గ్రాముల బరువు గల వెండి కమండలాన్ని (చిన్నది) (9) 300 గ్రాముల బరువు గల కమండలాన్ని (పెద్దది) కూడా వీరు అంజేశారు.
కౌలూరి సింధూర, పగిడాల, నంద్యాల జిల్లా వారు కూడా వెండి వస్తువులను సమర్పించారు. 810 గ్రాముల బరువు గల వెండి పళ్ళెం, 350 గ్రాముల బరువు గల వెండిపళ్లెం, 615 గ్రాముల బరువు గల 3 వెండి చెంబులను వీరు సమర్పించారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ పి. మార్కండేయశాస్త్రి అధ్యాపక ఎం. పూర్ణానందం, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునులకు ఈ బంగారు, వెండి వస్తువులను అందజేశారు. అనంతరం వారికి శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు.