మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టిడిపిలోకి 50 కుటుంబాలు చేరాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీకి చెందిన సద్దాం హుస్సేన్, వారి సోదరులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు. కాలనీలో పర్యటించిన అఖిల ప్రియకు గజమాలతో స్వాగతం పలికారు. అహ్మద్ హుస్సేన్, ఖాజా హుస్సేన్, రాజా హుస్సేన్ వారి అనుచర వర్గీయులైన సుమారు 50 కుటుంబాలు టిడిపిలో చేరడంతో ఆ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ లు వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2024/02/eb5ab6a3-d5eb-400c-8ded-67e94504ddd3-1024x576.jpg)