Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Karimnagar: కాంగ్రెస్ ఖాతాలోకే కరీంనగర్ పార్లమెంట్

Karimnagar: కాంగ్రెస్ ఖాతాలోకే కరీంనగర్ పార్లమెంట్

బండిని ఢీ కొట్టేందుకు రైట్ క్యాండిడేట్

రుద్ర సంతోష్ కుమార్… ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారిందనే మాట అక్షర సత్యం. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో కీలకంగా ఉంటూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వార్ రూం ఇంచార్జ్ గా తీవ్రంగా కృషి చేసిన రుద్ర సంతోష్ కుమార్ ఇక ప్రత్యక్ష రాజకీయల్లోకి ఎంట్రీ ఇస్తుండడం సంచలనంగా మారిందనే చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రుద్ర సంతోష్ కుమార్ పేరు అధిష్టానం పరీశీలనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండటం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు అయన సంతోష్ వైపే మళ్లింది.

- Advertisement -

పొన్నంకు సన్నిహితుడు..

మంత్రి పొన్నం ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడిగా, కరీంనగర్ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్న సంతోష్ కుమార్ పార్టీలోని అందరు సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడని, భారత్ జోడో యాత్రలో అగ్ర నేత రాహుల్ గాంధీతో జతకట్టి వివిధ సమస్యలను వివరించి వారి మనసు గెలుచుకున్నాడని, ఈ క్రమంలోనే ఏ.ఐ.సి.సి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్ర నేతల ప్రత్యేక చొరవతో ఇటీవలే ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో-ఆర్డినేటర్ గా ఎన్నికైన రుద్ర సంతోష్ అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ టికెట్ దాదాపు పొందే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

బీసీ వర్సెస్ బీసీ

ఇదే క్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో దిగనున్నట్లు తెలుస్తోన్న తరుణంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండనున్నట్లు, దీంతో ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా గత మూడు పర్యాయల నుండి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ బి.సి లకే కేటాయించడం, కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ విధానంతో కార్యకర్తలతో సామాన్యుడిగా కలిసిపోయే వ్యక్తిత్వం, అనుబంధం, పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం, ఉద్యమ కాలం నుండి జిల్లా నలుమూలల ఉన్న అశేష అభిమాన గణం వంటి అనేక మూలాలను ఆధారంగా చేసుకుంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా రుద్ర సంతోష్ కు కలిసి వచ్చే అంశాలని, దీనికి తోడు పార్టీ అంతర్గత సర్వేలోను సంతోష్ ముందుండటం, విషయ పరిజ్ఞానం, యూత్ ఫాలోయింగ్ ఇలా ఏ విధంగా చూసినా, బండి సంజయ్ ని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రుద్ర సంతోష్ అయితేనే కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ని సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్ సంతోష్ కుమార్ కి ఇస్తేనే ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం హస్తగతం అవుతుందని, లేదంటే చేతిలో ఉన్న స్థానాన్ని ఇతరులకు అప్పజెప్పక తప్పదనే చర్చ కొనసాగుతోంది. వేచి చూడాలి మరి అధిష్టానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News