Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభGlam Doll: సినిమాలు, రాజకీయాల్లో 'పురుచ్చి తలైవి'

Glam Doll: సినిమాలు, రాజకీయాల్లో ‘పురుచ్చి తలైవి’

సూపర్ వుమెన్, సూపర్ హీరోయిన్, సూపర్ పొలిటీషియన్. సినిమాలైనా-రాజకీయాలైనా.. ఆమెనే హీరోయిన్. వెండి తెరపైన, రాజకీయ తెరపైన ఆమెనే వండర్ వుమెన్. అందుకే అందరూ ఆమెను అమ్మ అంటారు. తమిళులకు ఆరాధ్య దైవం. పార్టీలకు అతీతంగా, భాషలకు అతీతంగా అందరూ ఆమెను రోల్ మోడల్ గా చూస్తారు. ఆ టాల్ పర్సనాలిటీ ‘పురుచ్చి తలైవి’ జయలలిత.

- Advertisement -

సెన్సేషనల్ ఐరన్ లేడీ కం గ్లామ్ డాల్

సినిమాల్లో గ్లామర్ ఒలకబోసే హీరోయిన్ నుంచి సెన్సేషనల్ ఐరన్ లేడీ వరకు ఆమె ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం. ఆమె సినిమా నటి మాత్రమే కాదు. ఆమె జీవితమే ఓ సినిమా. అందుకే క్వీన్, తలైవి వంటి బయోపిక్స్ ఆమె బయోగ్రఫీ ఆధారంగా వచ్చాయి. జయలలిత జీవితం ఎంతో ఆసక్తికరం. సినిమా కష్టాల్లో రియల్ లైఫ్ లోబతుకీడ్చిన ఆమె సినిమాల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగే వరకూ సాగింది. డబ్బు సంపాదించి మిలియనీర్ కావటమే తన టార్గెట్ అని ఆమె ఓపన్ గా చెప్పేవారు. అలాంటి దరిద్రం నుంచి వచ్చిన ఆమె మిలియనీర్ ఏంటి ఆమె సాధించనిదంటూ ఏమీ లేదు అనే స్టేజ్ వరకు ఎదిగారు.

అమ్మ..విప్లవ నాయకి

విప్లవ నాయకి అంటే తమిళంలో పురుచ్చి తలైవి. ఈమెపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. శోభన్ బాబు, ఎమ్జీఆర్తో ఆమెకు అఫైర్ అంటూ ఎన్నో ఫిల్మీ న్యూస్ అప్పట్లో షికార్లు చేసాయి. కానీ ఏనాడూ ఆమె తన వ్యక్తిగత విషయాలపై సెన్సేషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలా డిగ్నిఫైడ్ గా లైఫ్ లీడ్ చేశారు. యాక్ట్రెస్ గా కెరీర్ లో సెటిల్ అయిన జయలలిత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా ఉర్రూతలూగించారు. 1961 నుంచి 1980 వరకు ఆమె తిరుగు లేని హీరోయిన్ గా రాణించారు. మంచి డ్యాన్సర్ అయిన జయలలిత పాటల్లో ఎంతో బాగా డ్యాన్స్ చేసేవారు. డైలాగ్స్ డెలివరి, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్అన్నీ అదిరిపోయేవి.

ఎమ్జీఆర్, ఎన్టీఆర్ లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్

నటిగా ఇద్దరు సీఎంలు ఎంజీఆర్, ఎన్టీఆర్లతో కలిసి ఆమె స్క్రీన్ పైన చేసిన సినిమాలు సూపర్ హిట్సే. ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో ఎంజీఆర్-జయది హిట్ పెయిర్. అలా వాళ్ల రియల్ లైఫ్ లో కూడా ఎంజీఆర్ తరువాత ఆయన పొలిటికల్ హెయిర్ గా జయ తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేశారు. ఆ లెగెసీని కొనసాగించారు. అన్నాడీఎంకే పార్టీని ఆమె అధికారంలోకి తెచ్చి సీఎంగా ఎన్నో వెల్ఫేర్ స్కీములు తెచ్చింది జయనే.

కేసులు, జైలు జీవితం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో..ఆమె జైలు జీవితం గడిపారు. లెక్కలేనన్ని బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, చీరలు.. వాట్ నాట్. కొడనాడు వంటి చోట్ల టీ ఎస్టేట్, తోటలు, ఇళ్లు, ప్లాట్లు ఇతర బిజినెస్ లు ఇలా ఆమెకున్న ఆస్తి ఏకంగా ఆగర్భ శ్రీమంతుల కంటే ఎక్కువే. చెన్నైలోని పోయస్ గార్డెన్ లోని ఆమె ఇల్లు వేదనిలయం ఓ పెద్ద రాజమహల్ కు మించి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో దరిద్రం, అవమానాలు, ఒంటరితనం ఆమెను విపరీతంగా వేధించాయి. అందుకే ఆమె తనను అవమానించిన అందరిపై కక్ష తీర్చుకునేందుకు సై అన్నారు. ఆఖరుకి అది తన రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి అయినా లేక కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అయినా ఆమె వారిని లెక్క చేయలేదు. తనంటే ఏంటో తన పవరేంటో సత్తా చాటుకునేందుకు ఎంత దూరమైనా తెగించారు.

తల్లి కూడా నటే

జయ తల్లి వేదవల్లి అలియాస్ సంధ్య, ఓ సినీ నటి. మైసూరులో పుట్టిన జయ బెంగళూరులో చదువుకున్నారు. టెన్త్ లో స్టేట్ టాపర్ గా వచ్చారు. చదువంటే ఆమెకు ప్రాణం. కానీ తల్లిమాత్రం నువ్వు హీరోయిన్ కావాల్సిందే అంటూ ఆమెను గ్లామర్ వల్డ్ లోకి బలవంతంగా తోశారు. దీంతో ఇష్టం లేకపోయినా ఆమె సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. లిటరేచర్ అంటే ప్రాణం పెట్టే జయ పుస్తకాలు భలే చదివేవారు. సినిమా సెట్ లో సైలెంట్ గా ఉంటూ ఏమాత్రం టైం దొరికినా హ్యాపీగా పుస్తకాలు చదువుతూ టైంపాస్ చేసేవారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. కానీ స్కూల్ లో మాత్రం ఆమె పేరు జయలలిత. కన్నడ సినిమాతో ఆమె హీరోయిన్ గా 15 ఏళ్లకే కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో మనుషులు, మమతలు ఆమె కెరీర్ ను ఇంకో స్టేజ్ తీసుకెళ్లాయి. 41 సినిమాలకు పైగా తెలుగులో హీరోయిన్ గా యాక్ట్ చేశారు జయ.

క్వీన్ ఆఫ్ తమిళ్ సినిమా

క్వీన్ ఆఫ్ తమిళ్ సినిమాగా ఆమె యాక్ట్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ లే. కన్నడ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ అనర్ఘళంగా మాట్లాడగలిగే జయలలిత చాలా మంచి స్పీచ్ ఇస్తారు. సీఎం అయ్యాక మీడియాతో చాలా తక్కువ మాట్లాడేవారు జయ. చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. 15 ఏళ్లకే హిట్ సినిమాల్లో హీరోయిన్ గా బిజీ లైఫ్ స్టార్ట్ చేశారు. 43 ఏళ్లలోనే యంగెస్ట్ సీఎంగా ఆమె పొలిటికల్ కెరీర్ లో దూసుకుపోయారు. ‘ఈపిస్ట్లీ’ అనే ఇంగ్లీష్ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. ఇంగ్లీష్ డ్రామాల్లో జయలలిత అదిరిపోయేలా డైలాగ్స్ చెప్పి, ఎక్స్ ప్రెషన్స్ పెట్టేవారు. అదిచూసిన గెస్టులు ఆమె అందం-అభినయం తిరుగు లేనిది అని ఫిదా అయ్యేవారు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు ఓమారు ఆమెను యాక్టింగ్ స్కిల్ చూసి ఆమెకు ఇంగ్లీష్ సినిమాలో ఛాన్స్ ఇప్పించారు కూడా. అది 1961లో రిలీజ్ అయింది. స్కూల్లో ఎన్నో డ్రామాల్లో కూడా ఆమె యాక్ట్ చేశారు. జయలలితకు మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. ఆమె మంచి డ్యాన్సరే కాదు మంచి సింగర్ కూడా. ఆమె పాడితే అచ్చం కోయిల పాడినట్టే ఉంటుంది. చదువు, డ్యాన్స్, సింగింగ్, క్రికెట్, బుక్ రీడింగ్ ఇవన్నీ ఆమెకు అత్యంత ఇష్టమైనవి. అన్నట్టు ఆమెకు టైగర్ పటౌడీ అంటే పెద్ద క్రష్.

ఎమ్జీఆర్ తో ముడిపడ్డ..

ఎమ్జీఆర్ గురించి చెప్పకుండా జయ జీవితం ఎప్పుడూ పూర్తికాదు. ఫిల్మీ కెరీర్ అయినా పొలిటికల్ కెరీర్ అయినా అదంతా ఎమ్జీ రామచంద్రన్ తో ముడిపడినదే. ఆయనతో కలిసి ఏకంగా 25 కుపైగా సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు జయ. ఇక తెలుగులో అయితే ఎన్టీఆర్ జయలలిత కాంబినేషన్లో డజనుకుపైగా సినిమాలు వచ్చాయి అన్నీ సూపర్ హిట్సే. జయలలిత అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేవారు ప్రొడ్యూసర్స్. 1965 నుంచి 1977 వరకు దేశంలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ గా జయ సరికొత్త రికార్డ్ సృష్టించారు. 30 ఏళ్ల ఫిల్మీ కెరీర్లో ఆమె ప్యాన్ ఇండియా స్టార్. సౌత్లో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలాచాలా పెద్దది.

తమిళ ఫిలిం ఇండస్ట్రీకే గ్లామర్ నేర్పి..

ఆమె స్టార్డం ఏ స్థాయిలో ఉండేదంటే రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఏం మాట్లాడినా సెన్సేషన్ అయ్యేది. ఏం చేసినా దేశవ్యాప్తంగా అదే హెడ్ లైన్ న్యూస్ అయిపోయేది. అది జయకున్న క్రేజ్, అదే ఆమె స్పెషాలిటీ. హీరోయిన్ గా గ్లామర్ ను నెక్ట్స్ లెవెల్ లో చూపించారు జయ. దీంతో ఆమెకు గ్లామర్ ప్రపంచంలో తిరుగు లేకుండా పోయింది. పల్చని డ్రెస్ లో వాన డ్యాన్స్ పాటల్లో ఆమె రొమాంటిక్ సాంగ్స్ తో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకే గ్లామర్ నేర్పించారు. స్లీవ్లెస్ బ్లౌజులు, డ్రెస్సులతో హీరోయిన్ అంటే ఇలా ఉండాలనేలా ఆమె కొత్త ట్రెండ్ ను పరిచయం చేశారు.

పెళ్లి కాలేదు

జయలలితకు పెళ్లి కాలేదు. కానీ సుధాకరన్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. సుధాకరన్ పెళ్లిని కనివిని ఎరుగని రీతిలో అత్యంత అంగరంగ వైభవంగా చేశారు. సుధాకరన్ పెళ్లి రోజు చెన్నైలో ఏ హోటల్ ఎవరు ఏం తిన్నా బిల్ అంతా తనే కట్టారు జయ. ఇలాంటి పెళ్లి గురించి మీరెప్పుడైనా విన్నారా? అలాగని సుధాకరన్ ను వేదనిలయంలో ఉండనివ్వలేదు. తన రాజకీయ వారసుడిగానూ ట్రైన్ చేసి, అనౌన్స్ చేయలేదు. ఎందుకనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. వేల కోట్ల రూపాయల జయ ఆస్తులకు వారసులంటూ ఎవరనే విషయంపైనా సస్పెన్సే. ఆమె జీవితంలో అడుగడుగునా సస్పెన్సులే ఉన్నాయి. అసలు వీలునామా రాశారో లేదో కూడా ఎవరికీ తెలీదు. కిలోల కొద్దీ బంగారం, వెండి సామాన్లు, ఎస్టేట్లు, బంగ్లాలు, బిజినెస్ లు. కానీ తన తరువాత వీటికి వారసులు ఎవరనేది జయ ఎన్నడూ పెదవి విప్పి చెప్పలేదు.

అయినవాళ్లను దూరంగా పెట్టి..

తన సోదరుడు, సోదరుడికి కుటుంబాన్నికూడా ఆమె దూరంపెట్టారు. ఎందుకో ఆమె ఎప్పుడూ చెప్పలేదు. జయలలితకు తల్లి తరపున కొందరు చుట్టాలున్నారు. కానీ వారిని ఆమె ఎప్పుడూ కలవలేదు. చుట్టాలున్న విషయాన్ని కూడా చెప్పలేదు. ఇక 60ఏళ్ల బర్త్ డే సందర్భంగా జయలలిత తన క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ శశికళను పెళ్లి చేసుకున్నారు. అదంతా ఓ సెన్సేషన్. కానీ ఆమె ఏనాడూ ఈ విషయాలపై ఎవరికీ వివరణ ఇవ్వలేదు. అమ్మకు ఇష్టమైన రంగు గ్రీన్. అందుకే ఆమె ఎప్పుడూ గ్రీన్ కలర్ చీరలోనే కనిపించేవారు. చనిపోయినప్పుడు కూడా ఆమెకు గ్రీన్ రంగు చీరలోనే అంత్యక్రియలు చేశారు. డయాబెటిక్ వంటి అనారోగ్యాల కారణంగా ఆమె ఎంత మితంగా తిన్నా చాలా లావయ్యారు. దీంతో ఆమె ఎన్నోరకాల వ్యాధుల బారినపడ్డారు.

మరణం అతి పెద్ద మిస్టరీ

చివరికి ఆమె మరణం చుట్టూ కూడా ఎన్నో మిస్టరీలున్నాయి. జయలలిత అందం, తెలివితేటలున్న మహానటి, డిప్లమటిక్ లీడర్. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కు ఈమె కేరాఫ్ గా నిలిచి రాజకీయాల దశ దిశ మార్చారు. కానీ ఈమె వ్యక్తిగత జీవితమంతా ట్రాజెడీ, సీక్రెట్ల మయం. ఈ గుట్టంతా తెలిసిన వారెవ్వరూ లేరు. ఒంటరితనంతో ఆమె జీవితమంతా నరకం చూశారు. అందుకే ఆమె ఎవరినీ నమ్మేవారుకారు.

మహానటి జయలలిత సినిమాలంటే ఇప్పటికీ మన ఇంట్లో పెద్దవాళ్లు వావ్ అని చూస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News