Friday, November 22, 2024
Homeట్రేడింగ్Lay-offs: 6,000 మందిని ఇంటికి సాగనంపిన ఫిలిప్స్

Lay-offs: 6,000 మందిని ఇంటికి సాగనంపిన ఫిలిప్స్

ఫిలిప్స్ లేఆఫ్స్ ఇప్పుడు మరో సంచలనం సృష్టిస్తోంది. గతంలో 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఉత్పత్తిని పెంచుతూ, ఉద్యోగుల్లో మరింత చురుకుదనం నింపేలా తమ చర్యలు ఉండబోతున్నట్టు ఫిలిప్స్ అప్పట్లో తెలిపింది. సరిగ్గా 3 నెలల తరువాత తాజాగా మరో 6,000 మందిని ఇంటికి సాగనంపుతున్నట్టు ఫిలిప్స్ చేసిన ప్రకటన పరిశ్రమ వర్గాల్లో షాక్ నింపుతోంది. 2025 నాటికి మరింత మంది ఉద్యోగులను తగ్గించి, నాణ్యతా ప్రమాణాలు పెంచేలా కంపెనీ సరికత్త ప్రణాళికను అవలంభిస్తుందని ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకోబ్స్ వెల్లడించారు. ఆమ్స్టర్ డ్యాం కేంద్రంగా పనిచేసే ఫిలిప్స్ కంపెనీలో 2022 నాలుగవ క్వార్టర్ లో ఏకంగా 105 మిలియన్ యూరోల నష్టాలు వచ్చాయి. ఫిలిప్స్ యావత్ కంపెనీకి 2022లో అత్యధిక నష్టాలు వచ్చాయని, 1.6 బిలియన్ యూరోల నష్టాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయినట్టు సంస్థ వివరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News