Sunday, October 6, 2024
HomeతెలంగాణNandikotkuru: జై భీమ్ పార్కును ప్రారంభించిన శాప్ చైర్మన్ బైరెడ్డి

Nandikotkuru: జై భీమ్ పార్కును ప్రారంభించిన శాప్ చైర్మన్ బైరెడ్డి

ఏబీఎం పాలెం ప్రజల ప్రోత్సాహం మరువలేను

నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయాలలో తాను ప్రవేశించిన నాటినుండి నేటి వరకు ఏబీఎం పాలెం ప్రజల ప్రోత్సాహం తోడ్పాటు మరువలేనిదని ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏబీఎం పాలెంలో కూడా సహకారంతో 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన జై భీమ్ పార్కును మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ ధార హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏబీఎం పాలెం ప్రజలు ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు. అనంతరం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నూతనంగా నిర్మించిన జై భీమ్ పార్కును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగించిన సీఎం జగనన్న నాయకత్వమును మరోసారి ఆశీర్వదించాలని, నందికొట్కూర్ నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ చిన్న రాజు, వైస్ చైర్మన్ హర్ష పోగు ప్రశాంతి, వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు షేక్ రహత్ జబ్బర్, బద్దుల శ్రీకాంత్, ముస్లిం మైనార్టీ జోనల్ ఇన్చార్జి అబుబుకర్, వైసీపీ నాయకులు రామకృష్ణ,కెవి రమణ, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బేగ్, కౌన్సిలర్స్ రావుఫ్, చాంద్బాషా, షేక్ నాయబ్ లాలూ ప్రసాద్, మానుపాడు అశోక్, అల్లూరి కృష్ణ, జిల్లా షాప్ కోఆర్డినేటర్ రవికుమార్,పట్టణ యువత అధ్యక్షులు లడ్డు,మరియు ఓల్డ్ బి.ఎస్.ఆర్ టీం సభ్యులు అబ్దుల్లా,మరియు ఏబీఎం పాలెం ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News