Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్RS politics: రాజ్యసభ ఎన్నికల్లో నిస్సిగ్గు రాజకీయాలు

RS politics: రాజ్యసభ ఎన్నికల్లో నిస్సిగ్గు రాజకీయాలు

పెద్దల సభ ఎన్నికల్లో గలీజ రాజకీయాలు

పార్టీ ఫిరాయింపులు రాజకీయాలకు ప్రతీకగా మారిపోయాయి. ప్రజలు తమ ప్రతినిధులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఆ ప్రతినిధులే మంటగలపడం సరికొత్త అధోగతి రాజకీయాలకు అద్దం పడుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికలు దేశ రాజకీయాలు ఏ స్థితికి దిగజారుతున్నాయో చెప్పకనే చెప్పాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో పలువురు శాసనసభ్యులు నిస్సిగ్గుగా ఇతర పార్టీలకు ఓటు వేసి నీచ రాజకీయాలకు తెర తీశారు. వారు తమ పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రతిపక్ష అభ్యర్థికి ఓటువేసి హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రభుత్వాన్ని దాదాపు అస్థిరం చేయడం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ లో ప్రతిపక్షాల అభ్యర్థులకు శృంగభంగమై చిక్కుల్లో పడడం జరిగింది. సాధారణంగా ఫిరాయింపుల వల్ల ప్రభుత్వాలు కుప్ప కూలడం జరుగుతుంటుంది. 2022లో మహారాష్ట్రలో ఇదే జరిగింది. ఆ తర్వాత బీహార్‌ లో నితీశ్‌ కుమార్‌కు చెందిన జనతాదళ్‌ (యు) ఎన్‌.డి.ఏలో చేరడంతో ప్రభుత్వం మారింది.
అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు తారుమారై ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితి ఏర్పడిన సంఘటన మొదటిసారిగా హిమాచల్‌ ప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ఇటువంటి క్రాస్‌ ఓటింగు ద్వారా హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ లబ్ధి పొందింది. కర్ణాటకలో బీజేపీ శాసన సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయగా, మరొక అభ్యర్థి ఓటింగుకు గైర్హాజర్‌ కావడం జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో పది సీట్లకు గాను బీజేపీ ఎనిమిది సీట్లను చేజిక్కించుకో గలిగింది. వాస్తవానికి ఇక్కడ బీజేపీకి న్యాయంగా దక్కాల్సినవి ఏడు మాత్రమే. ఏడుగురు సమాజ్‌ వాదీ పార్టీ శాసనసభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఎనిమిది అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 40 మంది శాసనసభ్యులతో ఆ పార్టీ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీ తప్పకుండా రాజ్యసభకు గెలవాల్సి ఉంది. పైగా ఈ పార్టీకి ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా ఉంది. ఇక్కడ బీజేపీకి ఉన్న శాసనసభ్యుల సంఖ్య 25 మాత్రమే. అయినప్పటికీ, కాంగ్రెస్‌ సభ్యులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో సింఘ్వీ ఓడిపోవడం జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో సింఘ్వీ అవమానకరంగా ఓడిపోవడం జరిగింది.
కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో లాటరీ వేయడం, అందులో బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలుకావడంతో బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖూ రాజీనామా చేయాలని పట్టుబట్టడం ప్రారంభిం చింది. ఫలితంగా రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఉత్తర భారతదేశంలో తమకున్న ఏకైక ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్‌ చేజార్చుకునే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, ఈ పరిణామం బీజేపీ కూడా ఊహించ నిది. కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలను దెబ్బతీయడానికి బీజేపీయే ఇటువంటి కుట్రకు పాల్పడిం దనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు మాత్రం తమకు కాంగ్రెస్‌ అభ్యర్థి నచ్చనందువల్లే ఈ పనికి పాల్పడినట్టు చెబుతున్నారు.
అయితే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని, పార్టీలే అప్రమత్తంగా ఉండాలని భావిస్తు న్నవారు కూడా ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు, కుతంత్రా లకు పాల్ప డిందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కుతంత్రానికి పాల్పడిన విషయాన్ని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ప్రహస నాన్ని దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ లో కాంగ్రెస్‌ అప్రమత్తంగా ఉండాల్సిందంటూ ఆ పార్టీ నాయకులు కొందరు ట్వీట్‌ చేయడం ప్రారంభించారు. తమ పార్టీ శాసనసభ్యులను ఒక తాటి పైకి తీసుకు రావడంలోనూ, తమ అభ్యర్థికి ఓటు వేయించడం లోనూ కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలో ఘోరంగా వైఫల్యం చెందాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌ ఈ విషయంలో తన అసమర్థతను మరోసారి బయట పెట్టుకున్న ట్టయింది.
అంతేకాక, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలోనూ, శాసనసభ్యులను ఒప్పిం చడంలోనూ కాంగ్రెస్‌ ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోయింది. అంతర్గత సమస్యలను పార్టీ అధి ష్ఠానం ఏమాత్రం పట్టించుకోలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయడానికి సింఘ్వీని ఎంపిక చేయడం కాంగ్రెస్‌ చేసిన పెద్ద పొరపాటు. పార్టీలో తీవ్ర అసంతృప్తికి సింఘ్వీ ఎంపిక దారి తీసింది. పైగా, సుఖు పాలన పట్ల సొంత పార్టీలోనే ఉన్న అసమ్మతిని కూడా అధి ష్ఠానం పట్టించుకోలేదు. దీనిని బీజేపీ ఒక సదవకాశంగా మార్చుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News