అరటి పండు ఆరోగ్యకరమైన పండు. తినడానికి సులువుగా ఉండడమే కాదు ఈ పండులో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. గర్భిణీలకు ఈ పండు చేసే మేలు ఎంతోనంటున్నారు పోషకాహార నిపుణులు. గర్భిణీలకు అరటి పండును డైట్ లో తప్పకుండా చేర్చాలని ప్రెగ్నెంట్ కన్సల్టెంట్స్ కూడా చెపుతున్నారు.
ఈ పండులో ఫోలిక్ యాసిడ్, ఐరన్, మరెన్నో ఎసెన్షియల్ విటమిన్స్ బాగా ఉన్నాయి. ఇది తల్లికి కావలసిన ఎనర్జీతో పాటు కడుపులోని బేబీ ఓవరాల్ హెల్త్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు కూడా. గర్భిణీలు అరటిపండును నిత్యం తమ డైట్ లో ఉండేలా చేసుకోమనడానికి తగిన కారణాలు లేకపోలేదు. అరటిపండు మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది. అరటిపండులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పండులోని యాంటి నాజియా గుణాలు గర్భిణీలకు ఎంతో సాంత్వననిస్తాయి. మార్నింగ్ సిక్నెస్ లక్షణాలను ఈ పండు తగ్గిస్తుంది.
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును ఆరోగ్యకరంగా ఉండేలా చేయడమే కాదు క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఎందుకంటే వారిలో రక్తపోటు ఎగుడుదిగుళ్లు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి నిత్యం అరటిపండును వాళ్లు తింటే రక్తపోటు తగిన నియంత్రణలో ఉంటుంది. ఈ పండును గర్భిణీలు తప్పకుండా తినాలని ఆరోగ్యనిపుణులు అనడానికి మరో కారణం కూడా ఉంది. గర్భిణీలు ఎక్కువగా ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటుంటారు. అరటిపండులో ఉండే ఐరన్ ప్రమాణాల వల్ల గర్భిణీలకు తగినంత ఎనర్జీ అందుతుంది. అంతేకాదు శరీరానికి నేచురల్ సప్లిమెంటులా పనిచేస్తుంది కూడా. అరటి పండు వల్ల కడుపులో ఉన్న బేబీ బ్రెయిన్ కూడా బాగా డెవలెప్ అవుతుంది. బ్రెయిన్ డెవలెప్ కు విటమిన్ బి6, ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎంతో అవసరం. అవన్నీ కూడా అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ పండును గర్భిణీలు తినడం వల్ల కడుపులోని బేబీ బ్రెయిన్ డెవలెప్మెంట్ కూడా బాగా జరుగుతుంది.
అంతేకాదు అరటి పండు తినడం వల్ల ఎసిడిటీ, హార్ట్ బర్న్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఎసిడిటీ ప్రమాణాలను అరటిపండ్లు తగ్గిస్తాయి. ఇది గర్భిణీలకు ఎంతో సాంత్వననిస్తుంది.