మద్యానికి బానిసైన యువకుడు అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేగుంట మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేశవ గౌడ్ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇంట్లో జరిగిన ఘర్షణతో మనస్తాపం చెంది, క్షణికావేశంలో తాను కిరాయికి ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై సరిగ్గా కూలి పనులకు కూడా వెళ్లకుండా, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగి కోపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై ఆర్ బాలరాజు గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Chegunta: క్షణికావేశంతో జీవితాన్ని చాలించిన యువకుడు
మద్యానికి బానిసై, జీవితం బలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES