సంగమేశ్వరాలయంలో జలగర్భం వీడిన శివయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యంత పురాతనమైన, సు ప్రసిద్ది గాంచిన శైవ పుణ్య క్షేత్రాలలో సంగమేశ్వర దేవస్థానం ఒకటి. ఆరు నెలల నుండి గంగా జల దీక్షలో నిమగ్నమై ఉన్న ఇక్కడి స్వామిని ఫిబ్రవరి ఒకటో తారీఖున అంటే.. భీష్మ ఏకాదశి పర్వదినమున సంగమేశ్వర స్వామి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇవ్వనున్నాడు. ఈమేరకు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అడుగు నీటి లోతులో మాత్రమే స్వామి వారు నిక్షిప్తమై పునర్ దర్శనం ఇవ్వడంతో దేవాలయ గర్భాలయ ప్రాంగణాలన్నీ పరిశుభ్రం చేయడంలో దేవాలయ సిబ్బంది నిమగ్నమైనారు.
ఎగువ నుండి దిగువ రహదారి వరకు పరిశుభ్రం చేయడమే భక్తులకు స్వామివారి సర్వదర్శనం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు అర్చకులు తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా సంగమేశ్వర స్వామి వారు సంపూర్ణ దర్శనం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారని భక్తులకు సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు.