తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా పత్తికొండ సీనియర్ న్యాయవాది కె.సురేష్ కుమార్ ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక న్యాయవాదులు కె.మల్లికార్జున తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాలు, టీడీపీ నాయకులు చల్లా రవికుమార్ లు ఘనంగా పూలమాల వేసి సత్కరించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని ఎలాంటి పదవులైన వరిస్తాయని అన్నారు. తెలుగుదేశ పార్టీ అధినేత నా మీద నమ్మకం నుంచి పదవి కట్టు పెట్టినందుకు మమ్ము చేయకుండా నా వంతుగా పార్టీ కోసం కృషి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు వచ్చిన కష్టపడి పని చేస్తానని అన్నారు. స్వర్గీయులు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా తెలుగుదేశం లోనే కొనసాగుతూ పార్టీ కోసమే పని చేశానని అన్నారు. నా కొన్న ఊపిరి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కృష్ణయ్య. రంగస్వామి. వాసుదేవనాయుడు. హరికృష్ణ. అరుణ్. అబ్దుల్ రజాక్. సాంబశివుడు. రంగన్న. గుండు పాల్గొన్నారు.