Sunday, October 6, 2024
HomeతెలంగాణKoppula Eswar: కార్యకర్తలకు కొప్పుల దిశానిర్దేశం

Koppula Eswar: కార్యకర్తలకు కొప్పుల దిశానిర్దేశం

లోక్ సభ ఎన్నికల్లో ప్రచారంపై..

ధర్మపురి నియోజకవర్గం రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేపథ్యంలో పెగడపల్లి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ

“దేశ రాజకీయాల్లోనే ఒక ప్రభలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని అరుదైన ఖ్యాతి గౌరవం బీఆర్ఎస్ సొంతం. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. లక్షల ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్దాల తో గద్దెనెక్కింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి భాష ప్రవర్తన పద్ధతి ప్రజలు గమనిస్తున్నారు. కె‌సిఆర్ గారి పాలనలో జీవన్ రెడ్డి గారు ఒక్క సుక్క నీళ్ళు రాలేదు అని మాట్లాడారు.. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావడం లేదో చెప్పాలి. కెసిఆర్ గారు రాష్ట్రంలో 46 వేల చెరువులను మరమ్మతులు చేసి నిండు కుండలా నింపినాడు వాగులపై తూములు, చెక్ డ్యాంలు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రివర్స్ పంపింగ్ ద్వారా రైతుకు నీళ్ళు అందించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు నెలలు గడవకముందే సాగు నీళ్ళు అందక రైతులు గోస పెడుతున్నారు.‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెసిఆర్ లక్షల కోట్ల రూపాయలు అవినీతి చే‌సారని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రచారం దుష్ప్రచారం చేస్తూ.. మొత్తం కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులను నామరూపాలు లేకుండా చేస్తాడని, బాజాప్త గా ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటున్నారు తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తాడటా తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి” అంటూ ఆయన ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News