Monday, May 20, 2024
Homeహెల్త్Detox drinks are dangerous too: ‘డిటాక్స్’ డ్రింకులతో డేంజరే

Detox drinks are dangerous too: ‘డిటాక్స్’ డ్రింకులతో డేంజరే

డీటాక్స్ డ్రింక్స్ అస్సలు కొనద్దు, నాచురల్ గా డీటాక్స్ కావాలి

మార్కెట్ లో దొరికే డిటాక్స్ డ్రింక్స్ పెద్ద స్కామ్ అంటున్నారు ఆహార నిపుణులు. పెద్ద ప్రేవులను శుభ్రం చేయడానికి బయట తయారు చేసిన ఏ డిటాక్స్ ప్రాడక్టులు అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండడానికి అంటూ కుప్పలు తెప్పలుగా డిటాక్స్ ఉత్పత్తులెన్నింటినో మార్కెట్లోకి గుప్పించడం చూస్తున్నాం. శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి బయట దొరకుతున్న ఉత్పత్తులు అవసరమా? శరీరంలోని విషతుల్యపదార్థాలను బయటకు పంపే చర్యే డిటాక్సిఫికేషన్.

- Advertisement -

ఈ పనిని శరీరమే సహజసిద్ధంగా చేస్తుంది. అయితే సరైన రీతిలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరిగితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడే శరీరమంతాటా రక్తం, ఆక్సిజన్ ల ప్రసరణ బాగా జరుగుతుంది. అయితే శరీరం చేసే ఈ సహజసిద్ధమైన పనిని ఇపుడు మార్కెట్ శక్తులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. ఈ పని కోసం అంటూ పలు రకాల డిటాక్స్ ఉత్పత్తులను తెస్తున్నాయి. దీన్నే ఆహార నిపుణులు క్రిష్ అశోక్ పెద్ద స్కామ్ గా పేర్కొంటున్నారు. సప్లిమెంట్లు, జ్యూసులు, డైట్లు వంటివాటితో బరువు తగ్గడం నుంచి జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు పరిష్కరించడానికి ట్రీట్మంట్లుగా పేర్కొంటున్నారు.

కానీ నిజం ఏమిటంటే అవేవీ ఈ విషయాలకు పని చేయవని క్రిష్ అంటున్నారు. మనిషి శరీరంలోనే సహజసిద్ధమైన డిటాక్సిఫికేషన్ ప్రోసెస్ జరుగుతుంటుందంటారు ఆయన. కిడ్నీ, లివర్, డైజిస్టివ్ సిస్టమ్స్, చర్మం, ఊపిరితిత్తులు అన్ని అంగాలు రోజంతా చేసే పని డిటాక్సిఫికేషనే. అందుకే శరీర అవసరాలకు తగ్గట్టు డిటాక్సిఫికేషన్ సహజసిద్ధంగా జరగాలి.

నాచురల్ డీటాక్సిఫై అవ్వటం ఎలా

శరీరం సహజసిద్ధంగా డిటాక్సిఫై అవాలంటే నాలుగు సింపుల్ మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆరోగ్యకరమైన పదార్థాలనే ఆహారంగా తీసుకోవాలి. మీ శరీరం సరిగా పనిచేసేందుకు అవసరమైన న్యూట్రియంట్లు ఆ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీవక్రియ బాగా జరుగుతుంది. గట్ ను పరిశుభ్రం చేస్తుంది. శరీరంలోని మలినాలను, మలాన్ని, మూత్రాన్ని బయటకు పోయేలా చేస్తుంది. మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పనేమిటంటే నీళ్లు బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణతో పాటు ఆక్సిజన్ కూడా శరీరానికంతటికి బాగా అందుతుంది. ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. మలినాలు శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుంది. నీళ్లు శరీరంలోని మలినాలను బయటకు పంపడమే కాకుండా శరీరం ఆరోగ్యవంతంగా ఉండేలా సహాయపడుతుంది కూడా.

నిత్యం వ్యాయామాలు చేయడం కూడా శరీరం సహజ డిటాక్సిఫికేషన్ కావడానికి బాగా ఉపయోగపడతాయి. గుండె వేగాన్ని సమంగా ఉండేలా కూడా వ్యాయామాలు సహాయపడతాయి. అంతేకాదు ఊపిరి ఆరోగ్యవంతంగా తీసుకోగలం. రక్త ప్రసరణ కూడా శరీరమంతా బాగా అవుతుంది. అంతేకాదు నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరం చమటోడుస్తుంది. చర్మం ద్వారా మలినాలు పోతాయి. అంతేకాదు వ్యాయామాల వల్ల శరీరంలో తగినంత చెమట ఉత్పత్తి అవుతుంది కూడా. రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోతే శరీర డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు శరీరం కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అవి కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మలినాలు శరీరంలో పేరుకోకుండా నిరోధిస్తాయి కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News