వరుస విమాన దుర్ఘటనలు, మరోవైపు టెక్నికల్ కారణాలతో ఫ్లైట్స్ రీషెడ్యూల్స్.. ఇవన్నీ చాలక విమానంలో ప్రయాణికుల వికృత చేష్టలు.. ఇలా ఈమధ్యకాలంలో విమాన ప్రయాణం అంటేనే నరకంగా మారింది. ఈమధ్యనే బెంగళూరులో విమానం ప్యాసింజర్లను వదిలేసి ఫ్లై అయింది. ఇప్పుడు తాజాగా ఇండిగో విమానంలో ఒకటి రాజస్థాన్ కు వెళ్లాల్సిన ప్రయాణికుడిని ఏకంగా బిహార్ లో దించేశారు.
ఆలస్యంగా వెలుగోలికి వచ్చిన ఈ విషయంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించి, విచారణకు ఆదేశించింది. జనవరి 30 వ తేదీ సోమవారం నాడు ఇదంతా జరిగింది. దీంతో ప్యాసింజరును అదేరోజు తన గమ్యస్థానాలకు పంపించేశారు.
అఫ్సర్ హుసేన్ అనే ప్యాసింజర్ ఢిల్లీ నుంచి పట్నాకు ఇండిగో టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఇండిగో స్టాఫ్ మాత్రం అతన్ని ఉదయ్ పూర్ విమానంలో పంపారు. కానీ ఉదయ్ పూర్ వెళ్లాక విషయం అర్థమైన ప్యాసింజర్ ఎయిర్ లైన్స్ కు కంప్లైంట్ చేశారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఆయన్ను మళ్లీ ఢిల్లీ తీసుకొచ్చి..అక్కడి నుంచి పట్నాకు విమానంలో పంపింది. ఆఖరుకి బోర్డింగ్ పాసులు కూడా సరిగ్గా ఇండిగో చెక్ చేయట్లేదనే అనుమానం డీజీసీఏ వ్యక్తం చేస్తోంది. సరిగ్గా 20 రోజుల్లో ఇలా జరగటం ఇది రెండవ సారి. జనవరి 13వ తేదీన ఓ ప్యాసింజరును ఇండోర్ పంపాల్సి ఉండగా నాగ్పూర్ కు పంపారు.