Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Jagan key speech: కీలక ప్రసంగం చేసిన జగన్

Jagan key speech: కీలక ప్రసంగం చేసిన జగన్

వైయస్సార్‌ సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌.

- Advertisement -

సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…

ఈరోజు రిలీజ్‌ చేస్తున్న ఈ లిస్టు 25 పార్లమెంటులకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినది. ఇందులో ఒకే ఒక స్ధానం అనకాపల్లి ఎంపీ ఒక్కటి పెండింగ్‌ పెట్టాం. మిగతావి లిస్ట్‌ అనౌన్స్‌ అయినట్లే.
ఎప్పుడూ చూడని విధంగా దేవుడి దయతో సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చేసి చూపించగలిగాం అని చెప్పడానికి సంతోషపడుతున్నాను.

50 శాతం కచ్చితంగా నా…నా..నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్‌ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి మనమే అమలు చేశాం.

దాన్ని మనస్ఫూర్తిగా.. స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు అయితే… మొత్తం ఈరోజు 200 స్థానాలకు గానూ 100 స్థానాలు అంటే 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నా..నా.. అని పిలుచుకుంటూ 50 శాతం సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం.

ఈరోజు 200 స్ధానాలకు గానూ ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గానూ 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. మహిళలకు ఇంతకుముందుకన్నా బెటర్‌ గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలు వచ్చే సరికి ఇంకా వేగంగా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం.

200 స్థానాలకు 22 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తిగా కలిగించే అంశం కాకపోయినప్పటికీ… లాస్ట్‌ టైమ్‌ కన్నా బెటర్‌ గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీకన్నా బెటర్‌గానే ఉంటుందనుకుంటున్నాను. గతసారి 19ఇస్తే ఈసారి 24 దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషం అనే చెప్పాలి.
కానీ వచ్చే ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకా పెద్ద సంఖ్యలో నంబర్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.

ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో ఏకంగా 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యుయేట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గానూ 75 శాతం గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేయగలిగాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా..నా…నా అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.

ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. దాదాపుగా 99 స్ధానాలు అంటే 50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషపడుతున్నాను.

మార్పు కాబడిన వారికి, టికెట్‌ రాని వారికి మనస్పూర్తిగా చెబుతున్నాను. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగాజరుగుతుందని వాళ్లందరికీ భరోసా ఇస్తున్నాను.
కనీ వినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన జరిగింది. రూ.2.70 లక్షలకోట్లు నేరుగా బటన్‌ నొక్కడం, ఎక్కడాల లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లి పోవడం, రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం.

లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి కాదు.. ఇది సాధ్యమే అని 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు వాలంటీర్‌ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్ధ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండిపోతుంది.

ఈ ఒక్కటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులుమారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయి. ఎప్పుడూ జరగని విధంగా వ్యవసాయం బాగుపడింది.
ఉమెన్‌ ఎంపవర్‌ మెంట్‌ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను.

వీటన్నిటివల్ల ప్రస్పుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుని పోయే అడుగులు కూడా వేస్తాం అని చెబుతూ..అందరితో సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News