రాహుల్ అనే ఈ ఆటగాడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇతనికి పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లక తప్పదు. అది కూడా నైట్ డ్యూటీ. రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు కంటిన్యూగా కూలి పని చేస్తేకానీ పూట గడవని స్థితిలో ఉన్నాడు రాహుల్ అనే ఈ నేషనల్ అథ్లెటీ.
- Advertisement -
ప్రొఫెషనల్ రన్నర్ గా ఢిల్లీలో మూడు సారు రాష్ట్ర స్థాయి మెడల్స్ గెలిచినప్పటికీ ఆదుకునే ఆపన్నహస్తం కరువైంది. ఢిల్లీ మహానగరంలో ఓ చిన్న అద్దె గదిలో ఉంటూ ఓ పాల డైరీలో ఇలా రాత్రి పూట పనిచేస్తున్నాడు రాహుల్ . అండర్ -20 బ్రాంజ్ మెడలిస్టుగా 2017లో క్రాస్ కంట్రీ నేషనల్స్ గెలిచినా ఉపయోగం లేకపోయింది. పాల డైరీలో పనికి వెళ్లినరోజు రోజుకు 500 రూపాయలు మాత్రమే అతనికి చెల్లిస్తారు.