రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ప్రవేశ పెట్టిన నవరత్నాలు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నగర పంచాయతీ 2వ వార్డు కౌన్సిలర్ చింత నాగిరెడ్డిఅధ్యక్షతన బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయితి చైర్మన్ చలం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ బాబు రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి 2 వవార్డులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు.
మెరుగైన సంక్షేమం పాలన కోసం వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అవ్వ, తాతల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినెల ఒకటో తేదీఉదయాన్నే ఇంటి దగ్గరికి పెన్షన్లు అందజేశారని అన్నారు. మహిళలు అన్ని వర్గాల ప్రజలకు, కుల మతాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి సీఎం ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికీ పట్టం కట్టాలన్నారని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో నాగరాజు,చిన్న ఎద్దులన్న, గూని నాగేశ్వరరావు, ప్లాట్ల దస్తగిరి వైసిపి నాయకులు, కార్యకర్తలు ,అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు, మహిళలు పాల్గొన్నారు.