Monday, May 20, 2024
Homeహెల్త్Chia seeds: చియాతో చర్మ సౌందర్యం

Chia seeds: చియాతో చర్మ సౌందర్యం

చియా సీడ్స్ తో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు

చియా గింజలతో చర్మం మిల మిలలాడుతుంది. అంతేకాదు ఈ గింజలు మరెన్నో ప్రయోజనాలను చర్మానికి అందిస్తాయి. చర్మ సంరక్షణలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఇరిటేటెడ్ స్కిన్ కు ఇవి ఎంతో సాంత్వననిస్తాయి. అందులోనూ వేసవి కాలంలో ఇవి చర్మానికి అందించే రక్షణ ఎంతో. ఒక్కమాటలో చెప్పాలంటే చియా గింజలు న్యూట్రిషనల్ పవర్ హైస్. వీటి వల్ల చర్మానికి అందే ప్రయోజనాలు ఎన్నో. అవి…

- Advertisement -
  • పర్యావరణ కాలుష్యం వల్ల శరీరం ఎదుర్కొనే ఫ్రీరాడికల్స్ పై చియా గింజలు శక్తివంతంగా పోరాడతాయి. స్కిన్ ఏజింగ్ ను అడ్డుకుంటాయి. ఈ గింజల్లో ఎన్నో యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. ఎ, ఇ, సి వంటి విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను తటస్థీకరిస్తాయి. చర్మం దెబ్బతినకుండా ఆ రిస్కు తగ్గిస్తాయి.
  • చియా సీడ్స్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. దీర్ఘకాల ఇన్ఫెక్షన్ కారణంగా, ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల తలెత్తే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ రకరకాల ఆరోగ్య సమస్యలకు, చర్మ సమస్యలకు దారి తీస్తాయి.
  • చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇవి జీర్ణాశయంలో గుడ్ బాక్టీరియాను పెంపొందించి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. చియా గింజల్లోని యాంటాక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ కూడా ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. చర్మ రంగును పెంపొందిస్తాయి.
  • చియా గింజలు కొల్లాజెన్ బాగా ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు మన చర్మంలో కొల్లాజెన్ బాగా ఉంటుంది. ఇది చర్మం బిగువును, ఎలాస్టిసిటీని కాపాడుతుంది. చియా గింజలు యంగ్ గా కనిపించేలా చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తి కారణంగా వయసు తొందరగా మీద పడినట్టు కనిపించం.
  • చియా గింజల్లో తొమ్మిది రకాల ఎమినో యాసిడ్లు ఉన్నాయి. ఇవి కూడా చర్మంలోని కొల్లాజెన్ ను పరిరక్షిస్తాయి. చియాలో జింకు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ఇతరత్రా చాలా ఉంటాయి. ఇవి కొల్లాజెన్
    సింథసిస్ ను పరిరక్షిస్తాయి. చర్మం నేచురల్ బ్యారియర్ ను కూడా చియా గింజలు బలంగా ఉండేలా చేస్తాయి. చర్మం పైపొరలో కొలెస్ట్రాల్, సెరమైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మానికి సురక్షితమైన బారియర్ గా పనిచేస్తాయి. ఈ ప్రొటెక్టడ్ బారియర్ చర్మం లోపల వరకూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. బయట స్ట్రెస్టర్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాదు చర్మ కణాలకు ఎసెన్షియల్ న్యూట్రియంట్లను కూడా చేరవేస్తుంది. చియా గింజలు స్కిన్ బారియర్ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి.
  • ఇందులోని మేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని పరిరక్షిస్తాయి. చర్మం తేమదనాన్ని సంరక్షిస్తాయి. స్కిన్ ఉపరితల భాగం బలంగా ఉండేలా చేస్తాయి. చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు యాంటాక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మం హైడ్రేషన్ ను మరింత పెంచుతాయి. ఈ గింజలు స్కిన్ కు మాయిశ్చరైజింగ్ ఏజెంట్లలా పనిచేస్తాయి.
  • అతినీలలోహిత కిరణాల నుంచి చియా గింజలు చర్మాన్ని రక్షిస్తాయి. యువి కిరణాల వల్లే ప్రిమెచ్యూర్ ఏజింగ్ బారిన పడతాం. అంతేకాదు ఈ కిరణాలు చర్మం పొటెక్టివ్ బారియర్ ని బలహీనపరుస్తాయి కూడా. యువి కిరణాలు స్కిన్ డిఎన్ఎ కణాలను సైతం క్షీణింపచేస్తాయి. చియా గింజల్లోని యాంటాక్సిడెంట్లు, పొలిఫినోల్స్, జింక్ తదితర ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.ఇవి ఫొటోప్రొటెక్టివ్ సుగుణాలను కలిగి ఉన్నాయి. అవి యువి రేడియేషన్ దుష్పరిణామాలు చర్మంపై పడకుండా కాపాడతాయి.
  • చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ పడకుండా కూడా చియా సీడ్స్ ఉపయోగపడతాయి. చియా గింజల్లోని ఫోటోప్రొటెక్టివ్ సుగుణాల కారణంగా యువి కిరణాల వల్ల మనకు తలెత్తే నష్టం బాగా తగ్గుతుంది. చర్మంపై పడే ముడతలు కూడా తగ్గుతాయి. చియా గింజల మొక్క లోని కొల్లాజెన్ బూస్టింగ్ గుణాల వల్ల మనం
    మ్రుదువైన చర్మంతో యంగ్ గా కనిపిస్తాం.
  • చియా గింజలు సహజసిద్ధమైన చర్మం ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తాయి. ఇవి చర్మంపై ఉండె సెబమ్, మురికి, మ్రుతకణాలను పోగొడతాయి. ఈ గింజల్లోని హైడ్రేటింగ్ గుణాలు ఉన్న ఒమేగా 3 ఫ్యాట్స్, పొటాషియం, మెగ్నీషియంల కారణంగా చర్మం ఇరిటేట్ కాదు. సెన్సిటివ్ స్కిన్ నుంచి అన్ని రకాల చర్మాలకీ చియా గింజలు చక్కగా సరిపడతాయి.
  • చియా సీడ్స్ వల్ల యాక్నే కూడా తగ్గుతుంది. ఈ గింజల్లో జింకు పుష్కలంగా ఉంది. అంతేకాదు చాలా యాక్నే ఉత్పత్తుల్లో జింకు వాడకాన్ని గమనించవచ్చు. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి బాక్టీరియల్ గుణాల వల్ల , సెబమ్ రెగ్యులేటింగ్ సుగుణాల కారణంగా యాక్నే ఉత్పత్తుల్లో వాడతారు. చియా
    గింజల్లోని ఎక్స్ ఫొయిలేటింగ్ ఏజెంట్స్ చర్మంపై ఉండే మురికిని, మ్రుతకణాలను, సెబమ్ ను పోగొడతాయి. యాక్నే బ్రేకవుట్స్ ను అడ్డుకుంటాయి.
  • చర్మంపై తలెత్తే ఇరిటేషన్, దురదలను చియా గింజలు తగ్గిస్తాయి. వీటిల్లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. హైడ్రేషన్ ను పెంచుతాయి. పొడిగా, ఇరిటేషన్ తో ఉండే చర్మానికి సాంత్వననిస్తాయి. చియా సీడ్స్ ఆయిల్ ఈ విషయంలో మరింత బాగా పనిచేస్తుంది.
  • నల్లటి వలయాలు కూడా చియా గింజలతో తగ్గుతాయి. హైపర్ పిగ్మెంటేషన్ ను కూడా తగ్గిస్తాయి. వీటిల్లోని విటమిన్ ఇ, పోలిఫెనోల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు చర్మానికి అతినీలలోహిత కిరణాల వల్ల అయ్యే డ్యామేజిని తగ్గిస్తాయి.

చియా గింజలను ఇలా..

చియా గింజలను రోజులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాడొచ్చు. ఈ గింజలకు ఏదైనా లిక్విడ్ ని చేర్చాలి. దీన్ని స్మూదీలో కలుపుకుని తాగొచ్చు. బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, స్నాక్ లకు పుడింగ్ లాగ కూడా తీసుకోవచ్చు. చియా గింజలను నీటిలో లేదా పాలు లేదా జ్యూసులో నానబెట్టేటప్పుడు ఒక వంతు చియా గింజలు, నాలుగు వంతులు లిక్విడ్ తీసుకుని 15 నుంచి 20 నిమిషాలు అందులో నానబెట్టాలి. బెర్రీలు,
నట్స్,కొబ్బరిముక్కలు, తేనె వంటివి కూడా అందులో వేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News