Friday, November 22, 2024
Homeహెల్త్Collagen: కొల్లాజెన్ తగ్గితే ముసలివాళ్లలా కనిపిస్తారు

Collagen: కొల్లాజెన్ తగ్గితే ముసలివాళ్లలా కనిపిస్తారు

అందం, ఆరోగ్యాలనిచ్చే కొల్లాజెన్

- Advertisement -

అందమైన కురులకు, పట్టులాంటి చర్మానికి కొల్లాజెన్ చాలా మంచిదని వినే ఉంటారు. ఇంతకూ ఈ కొల్లాజెన్ ఏమిటి? దీని లాభాలు ఏమిటి? అంటే బోలెడు ఉన్నాయనే చెప్పాలి. కొల్లాజెన్ అనేది ప్రొటీన్. ఇది మన శరీరంలో పుష్కలంగా ఉంటుంది. అందనికే కాదు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది. ఇది కండరాల్లో, ఎముకల్లో, చర్మంలో ఇలా చాలా అవయవాల్లో ఉంటుంది. ఈ ప్రొటీన్ శరీరానికి ఆక్రుతితో పాటు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని అన్ని విధాలా సమతుల్యం చేస్తుంది.
రెండు రకాలుః
మన శరీరంలో ఉండే కొల్లాజెన్ లో రెండు రకాలు ఉన్నాయి. వాటిల్లో ఎండేజరస్ కొల్లాజెన్ ఒకటి. ఇది అత్యంత సహజసిద్ధంగా మన శరీరంలో ఉండేది. మన శరీరం ద్వారానే అది సింథసైజ్ అవుతుంది. ఇంకొకటి ఎక్సెజెనస్ కొల్లాజెన్. ఇది శరీరం బయట నుంచి మనకు అందుతుంది. అంటే ఆహారం నుంచి లేదా సప్లెమెంట్ల నుంచి ఈ కొల్లాజెన్ ను మనం పొందుతాం.


కొల్లాజెన్ లోపం-లక్షణాలుః

వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ కూడా తగ్గుతూ వస్తుంది. అలాగే కొన్ని రకాల లక్షణాలు కూడా మన శరీరంలో కొల్లాజెన్ తగ్గుతుండడాన్ని తెలుపుతాయి. వాటిల్లో ఒకటి ప్రిమెచ్యూర్ ఏజింగ్. మీ చర్మం కాంతివిహీనంగా , జీవరహితంగా ఉంటే , చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ పడుతుంటే కూడా శరీరంలో కొల్లాజెన్ క్షీణిస్తోందని అర్థం. బలహీనమైన కండరాలు, ఎముకల వల్ల మనకు కీళ్ల నొప్పులు వస్తాయి. తొందరగా గాయాల పాలవుతాం. కీళ్లు బిగుసుకుపోవడం, ఇబ్బందిగా ఉండడం, గాయాలు ఎక్కువవడం
ఇవన్నీ కూడా కూడా మన శరీరంలో కొల్లాజెన్ తగ్గుతుందన్నదానికి సూచిక. పొడిచర్మం, గోళ్లల్లో పగుళ్లు, సెల్యులైట్ ఏర్పడడం, జుట్టు పలచబడడం, పిగ్మెంటేషన్, వెరికోస్ వెయిన్స్ వంటివి కూడా శరీరంలో కొల్లాజెన్ క్షీణిస్తోందని తెలుపుతాయి.


కొల్లాజెన్ వల్ల లాభాలుః
-చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ అత్యావశ్యకం. ఇది చర్మాన్ని బలంగా ఉంచడంతో పాటు స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. అంతేకాదు చర్మంలో హైడ్రేషన్ ను కూడా బాగా మెరుగుపరుస్తుంది. వయసును పెంచే లక్షణాలు మనలో తలెత్తకుండా అడ్డుకుంటుంది. ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.
-కొల్లాజెన్ స్ట్రక్చరల్ ప్రొటీన్. ఆర్టిరీస్ కు ఒక రూపును ఇస్తుంది. ఆర్టిరీస్ రక్త నాళాలు. ఇవి చాలా ముఖ్యం. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి ఇవి సరఫరా చేస్తాయి. కొల్లాజెన్ ఆర్టీరీస్ ను బలంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేలా సహాయపడతాయి. అంతేకాదు గుండె సమస్యలు తలెత్తకుండా తగ్గిస్తాయి.
-కీళ్లు, ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో కూడా కొల్లాజెన్ పాత్ర ఎంతో ఉంది. కీళ్లు క్షీణించడం వల్ల ఆస్టియోపొరాసిస్, ఆస్టియోఆర్త్రైటిస్ లాంటి డిజార్డర్లు వస్తాయి. ఇవి తలెత్తకుండా వీటి తీవ్రతను కొల్లాజెన్ తగ్గిస్తుంది. జాయింట్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఎముకల రూపును కాపాడుతూ అవి విరగకుండా సంరక్షిస్తుంది.

-ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా కొల్లాజెన్ పెంచుతుంది. ముఖ్యంగా శిరోజాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి బాగా ఉన్నప్పుడు శిరోజాలు కూడా బాగా పెరుగుతాయి.

-కొల్లాజెన్ గోళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. గోళ్లు ఊడిపోకుండా, చిట్లకుండా, విరగకుండా సంరక్షిస్తుంది. అంతేకాదు గోళ్లు బలంగా ఉండేలా సహాయాపడుతుంది. కొల్లాజెన్ సమ్రుద్ధిగా ఉన్న
ఆహారపదార్థాలు తింటే కొల్లాజెన్ సప్లిమెంట్లు వాడనవసరం లేదు.
కొల్లాజెన్ ఫుడ్స్ః
కొల్లాజెన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లో సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి. వీటితో పాటు జామ, కివి, అనాస, అవకెడో, మామిడి వంటి పండ్లల్లో కూడా కొల్లాజెన్ బాగా ఉంది. ఇక కూరగాయల్లో వెల్లుల్లి, ఆకుకూరలు, బీన్స్, టొమాటోలు వంటి వాటిల్లో కూడా కొల్లాజెన్ ఉంది. ఇంకా ఎముకల సూప్, తెల్ల సొన, చికెన్, చేప, షెల్ ఫిష్, బెర్రీలు,అవిసె గింజల్లో కూడా కొల్లాజెన్ బాగా ఉంటుంది. వాల్నట్స్ లో సైతం కొల్లాజెన్ బాగా
ఉంటుంది.

కొల్లాజెన్ బూస్టింగ్ రెసిపీలుః
కొల్లాజెన్ డ్రింక్స్ బాగా ఫేమస్. ఈ డ్రింకు తయారుచేయడానికి రెండు టేబుల్ స్పూన్ల ఉలవల పిండి, రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, అర కప్పు మామిడి ముక్కలు, అరకప్పు కివి ముక్కలు , సరిపడినన్ని నీళ్లు రెడీ పెట్టుకోవాలి. పొడి పదార్థాలన్నింటినీ మిక్సర్ లో వేసి బాగా గ్రైండ్ చేసి మెత్తటి పొడిలా చేయాలి. తర్వాత పళ్లను గ్రైండర్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి జ్యూసులా చేయాలి. దాన్ని
ఒక గ్లాజులో పోసుకుని తాగాలి. రెడీగా తయారుచేసి పెట్టుకున్న కొల్లాజెన్ పౌడర్ తో కూడా కొల్లాజెన్ డ్రింకు చేసుకోవచ్చు.

ఈ పొడి తయారీకి 25 గ్రాముల గుమ్మడి గింజలు (గ్లైసిన్ ఉన్నవి), 25 గ్రాముల రోస్టెడ్ సోయాబీన్స్(ప్రొలైన్ ఉంటుంది), ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా లేదా ఇండియన్ ఉసిరి కాయ పొడి (సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది), 50 గ్రాముల డ్రై రోస్టెడ్ ఓట్స్, ఒక టీస్పూన్ పసుపు (యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి), 25 గ్రాముల డార్క్ చాక్లేటు లేదా కోకో పౌడర్ (కాపర్ ఎక్కువగా ఉండేది) ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మిక్సర్ గ్రైండర్ తీసుకుని అందులో ఈ పదార్థాలన్నింటినీ వేసి మెత్తటి పొడిలా చేయాలి. ఈ పొడిని గాజు కంటైనర్ లో పోసి ఫ్రిజ్ లో భద్రం చేయాలి. మీకు కావలసినపుడు అందులోంచి ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసుకుని గోరువెచ్చటి నీళ్లల్లో వేసి బాగా కలిపి దాన్ని మీరు తినే స్మూదీ లేదా
జ్యూసు లేదా వేడి పాలల్లో కలుపుకుని తాగితే చాలా మంచిది.

సప్లిమెంట్స్ః
సప్లిమెంట్ల విషయానికి వస్తే కొల్లాజెన్ సప్లిమెంట్లు చాలావరకూ సురక్షితంగానే ఉంటాయి. కానీ కొంతమందికి ఇవి పడకపోవచ్చు. కొందరు వీటి ఎలర్జీకి గురికావచ్చు. అందుకే లేబుల్ మీద ఉన్న
పదార్థాల జాబితా ఒకసారి చూసుకొని ఆ తర్వాత దాన్ని కొనడం ఉత్తమం. అలాగే దీన్ని వాడే ముందు వైద్యుని సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News