నంబరు ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్ వంచినా, అడ్డంగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కారేపల్లి ఎస్సై ఎన్ రాజారాం హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కారేపల్లి బస్ స్టాండ్ సెంటర్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారు చలానాల నుండి తప్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబర్ లోని టీఎస్, ఏపీ అక్షరాలతో పాటు చివరి రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్స్, ప్లాస్టర్స్, మాస్క్ లు వేస్తున్నారని తెలిపారు. నంబరు ప్లేట్లు లేని పలు వాహనాలను పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Karepalli: నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే 420 కేసు
స్టిక్కర్స్, ప్లాస్టర్స్, మాస్క్ లు వేస్తే..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES