చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఈనెల 8, 9 తేదీన జరిగే ‘హలో బీసీ ఛలో ఢిల్లీ’ పోస్టర్ని ఆవిష్కరించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఈ మహాధర్నా పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని, యువత పెద్ద ఎత్తున పాల్గొని, ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సత్తా చాటాలని కోరింది బీసీ సంఘం. దేశ జనాభాలో సగంకు పైన ఉన్న బీసీలను కేంద్రం విస్మరిస్తుందని బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా విద్యారంగాన్ని నీరు కార్చారని కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.11 లక్షల కోట్లు కేవలం వడ్డీలకే సరిపోతుంది అని పేర్కొన్నారు.