Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభRajasree: జానపద రాణి రాజశ్రీ

Rajasree: జానపద రాణి రాజశ్రీ

ఫోక్ క్యారెక్టర్స్, మైథాలజీకి .. కేరాఫ్ అడ్రస్ ఆమెనే. లెజెండరీ యాక్టర్ గా ఆమె చాలా కూల్ గా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కూడా. అదేంటి సెలబ్రిటీలకు పీస్ ఫుల్ పర్సనల్ లైఫ్ ఉంటుందా అనేగా మీ డౌట్ మరదే ఈమె స్పెషాలిటీ. ఎంత స్టార్ అయినా చాలా హ్యాపీగా, పీస్ఫుల్ గా, రియల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ మహానటి పేరే రాజశ్రీ. మీ అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలకు ఈమె ఫేవరెట్ యాక్టర్ అనే విషయం మీకు గుర్తుకు వచ్చిందా. రాజశ్రీ యాక్ట్ చేసిన ఒక్క సినిమా చూడండి చాలు మీరు కూడా ఆమెకు ఫ్యాన్ అయిపోతారు.. మరదే ఆమెలో ఉన్న మ్యాజిక్.

- Advertisement -

అసలు పేరు కుసుమ కుమారి

రాజశ్రీ అనేది ఈమె అసలు పేరు కాదు జస్ట్ స్క్రీన్ నేమ్. రీల్ నేమ్ రాజశ్రీగా స్టార్డం ఎంజాయ్ చేసిన ఆమె రియల్ నేమ్ కుసుమ కుమారి. విశాఖపట్నం ఈమె నేటివ్ ప్లేస్. సూర్యనారాయణ రెడ్డి, లలితా దేవిల సంతానం రాజశ్రీ. రైల్వేల్లో స్టేషన్ మాస్టర్ గా రాజశ్రీ ఫాదర్ జాబ్ చేస్తుండేవారు. విజయవాడ, ఏలూరుల్లో ఈమె బాల్యం సాగింది. అంటే 16 అణాల తెలుగమ్మాయి మన రాజశ్రీ.

ఫిల్మీ దునియాకు దూరం దూరం..

ప్రెజెంట్ గా ఈమె చెన్నై, వైజాగ్, హైదరాబాద్ సిటీల్లో ఉంటున్నారు. ఈ మూడు సిటీలకు షటిల్ కొడుతూ ఫిల్మీ దునియాకు దూరంగా ఉంటున్నారు రాజశ్రీ. అదేంటి ఈమె హీరోయిన్ గా బ్రేక్ తీసుకున్నాక అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాలేదు. పైగా టీవీల్లో కూడా ఏ సీరియల్స్, వెబ్ సిరీస్ ల్లో యాక్ట్ చేయలేదంటే.. నాకు అది ప్రయారిటీ కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పటం రాజశ్రీ స్పెషాలిటీ.

10 ఏళ్ల నుంచే రీల్ లైఫ్

నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె 10 ఏళ్లకే తెరంగేట్రం చేశారు. పైగా మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడానూ. సో డ్యాన్స్, యాక్టింగ్ ను చాలా ఈజీగా చేయగల టాలెంట్ ఈమెకు చాలా నాచురల్ గా వచ్చింది. చైల్డ్ యాక్టర్ నుంచి హీరోయిన్ గా మారారు. హీరోయిన్ గా రిటైర్డ్ అయిపోయారు. మీడియాతో ఫ్రెండ్లీగా ఉండే రాజశ్రీ చాలా సింపుల్ గా హ్యాపీగా నిజ జీవితంలో ఉండటం ఆమె ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది..

1956లో నాగుల చవితి అనే సినిమాతో ఆమె చైల్డ్ యాక్టర్ గా ఫిల్మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అంతే తన ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ పెద్దలను ఆమె ఫిదా చేశారు. ఏంటీ చిన్నపిల్ల.. ఇంత బాగా యాక్ట్ చేస్తోంది.. అదరగొడుతోంది..ఇక డ్యాన్స్ అల్టిమేట్ గా చేస్తోంది..ఈమె మైథాలజీ రిలేటెడ్ క్యారెక్టర్స్ కు సూపర్ గా సెట్ అవుతుందని.. చెన్నైలో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు.

ఆతరువాతి నిత్య కల్యాణం పచ్చతోరణం అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సో.. 1960 నుంచి ఈమె హీరోయిన్ గా వెండితెర ఇలవేల్పుగా మారిపోయారు. హిందీ ఫిలిమ్స్ లో కూడా రాణించిన కొద్దిమంది సౌత్ స్టార్స్ లో ఈమె కూడా ఒకరు.

చీఫ్ విప్ భార్యగా..

జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన తోట పాంచజన్యంను ఈమె మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నారు. రాజశ్రీ యాక్టర్ గా చాలా సక్సెస్ ఎంజాయ్ చేశారు. అందం, అభినయం రెండూ ఉన్న అరుదైన నటిగా ఆమె తన కెరీర్ లో పీక్స్ కు వెళ్లారు. తమిళం, తెలుగు, కన్నడలో ఈమెకు అప్పట్లో లెక్కలేనంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

గొప్పగా పిలిచేవారు..

భామా విజయం రాజశ్రీ, కధాలిక్కా నీరం ఇలై రాజశ్రీ అంటూ ఈమెను తెలుగు, తమిళంలో గొప్పగా పిలిచేవారు. ఇవి రెండూ ఆమెకు వచ్చిన హయ్యస్ట్ టైటిల్స్. అందమే ఆనందం అనే మూవీ ఈమె లాస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ. ఇది 1977లో రిలీజ్ అయింది. ఆతరువాత ఆమె ఏ సినిమాలు యాక్సెప్ట్ చేయకుండా.. పర్సనల్ లైఫ్ లో బిజీ అయ్యారు.

టాప్ 11 సౌత్ యాక్ట్రెస్ ఫరెవర్..

టాప్ 11 సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఎవర్ లో రాజశ్రీ కూడా ఒకరు. మోస్ట్ రెవర్డ్ అండ్ రెస్పెక్టెడ్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ లో రాజశ్రీ ఒకరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంత లెజెండరీ యాక్టర్ చాలా సింపుల్ గా ఉండటం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. తమిళ్, మళయాళం, కన్నడ, హిందీతోపాటు తెలుగులోనూ యాక్ట్ చేశారు రాజశ్రీ. ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఆమె అప్పట్లో సిల్వల్ స్క్రీన్ ను ఏలారు.

రీల్ లైఫ్ రాకుమారి

రాకుమారి రోల్స్అంటే ప్రిన్సెస్ రోల్స్ కు కేరాఫ్ గా కెరీర్ లో సెటిల్ అయ్యారు రాజశ్రీ. ఎన్టీఆర్, కాంతారావ్ వంటి యాక్టర్స్ తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. 200కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన రాజశ్రీ ప్యాన్ ఇండియా స్టార్ గా ఇయర్ అంతా కాల్ షీట్స్ తో ఫుల్ బిజీగా ఉండేవారు. 176 తెలుగు సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. రాజశ్రీ సినిమాలు చూడటం అంటే క్లాసిక్ కల్ట్ మూవీస్ ఎంజాయ్ చేయటంగా ఆమె సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. కన్నడలో 30 సినిమాలు, తమిళ్ లో 60 సినిమాలు చేశారు ఆమె. ఇందులో కొన్ని కామెడీ మూవీస్ కూడా ఉండటం హైలైట్. హీరోయిన్, సెకెండ్ హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయటం ఆమె స్పెషాలిటీ.

జయలలిత, ఆమె తల్లితోనూ కలిసి..

తమిళనాడు మాజీ సీఎం, హీరోయిన్ జయలలితతో కలిసి యాక్ట్ చేశారు రాజశ్రీ. అంతేకాదు జయలలిత తల్లి సంధ్యతో కలిసి కూడా స్క్రీన్ చేయటం రాజశ్రీ స్పెషాలిటీ. ఇంత టాల్ యాక్టర్ అయినా ఆమె మెడిటేషన్ వంటి వాటిలో డే అంతా స్పెండ్ చేస్తుంటారు. సత్యసాయి బాబా భక్తురాలైన రాజశ్రీ .. సరోజాదేవి, కాంచన, జమున, పీ సుశీల, అంజలీదేవి, రాజసులోచన, షావుకార్ జానకి, సెంచు, చో రామస్వామి, విజయకుమారి, జయలలిత వంటివారితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వీరంతా అప్పుడప్పుడు కలిసి లంచ్, డిన్నర్ చేసేవారుకూడా. ఓమారు వీరంతా జయలలిత ఇంటికి కూడా కలిసి వెళ్లారు.

మళయాళీల గ్రేసీ ఈమెనే

తమిళనాడులో అత్యున్నత అవార్డుగా భావించే కలైమామణి అవార్డును సొంతం చేసుకున్న యాక్టర్ మన రాజశ్రీ. అంతేకాదు..తమిళనాడు సర్కారు ఇచ్చే దాదాపు అన్ని అవార్డులు ఈమెకు వచ్చాయి. ఎంజీఆర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చెన్నైలో ఎక్కువగా ఉంటారు రాజశ్రీ.. మళయాళీలు ఈమెను గ్రేసీగా పిలుస్తారు. భార్య అనే మళయాళం సినిమాలో గ్రేసీ రోల్ రాజశ్రీ ఇరగదీశారు. అందుకే అదే పేరుతో ఆమెన ఇప్పటికీ పిలుస్తారన్నమాట.

ప్రయారిటీ సౌత్ మాత్రమే

హిందీలో 4 ఫిలిమ్స్ లో ఆమె యాక్ట్ చేశారు. ప్యార్ కియే జా సినిమా ఈమెకు బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది. హిందీలో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ తన ప్రయారిటీ మాత్రం సౌత్ ఇండస్ట్రీనే అనేవారు రాజశ్రీ. అందుకే బ్యాక్ టు బ్యాక్ సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక రాజశ్రీ ఫ్యామిలీకి ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు. ఆమె పేరెంట్స్ కు రాజశ్రీ సినిమాల్లో పనిచేయటం అస్సలు ఇష్టం లేదు. కానీ డ్యాన్స్ నేర్చుకుంటున్న టైంలో ఆమె అనుకోకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చేశారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు..అంటే జయలలిత, ఎంజీఆర్, ఎన్టీఆర్ లతో కలిసి యాక్ట్ చేశారు రాజశ్రీ. తమిళనాడు సీఎం కరుణానిధితో కూడా సినిమాల్లో కలిసి పనిచేశారు రాజశ్రీ. చిన్నప్పటినుంచీ ఆమె స్కూల్ లోనే చాలా డ్రామాలు వేసేవారు. సినిమాల్లో యాక్ట్ చేయటం కోసం ఆమె ఉర్దూ, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం భాషలన్నీ నేర్చుకున్నారు. ఉర్దూ మాట్లాడటం, రాయటం, చదవటం కూడా వచ్చు.

రాజశ్రీ రోడ్

మీకు తెలుసా రాజశ్రీ రోడ్ అని ఒక స్ట్రీట్ చెన్నైలో ఉంది. కానీ తెలుగు సినిమా వజ్రోవత్సవాలకు రాజశ్రీని ఇన్వైట్ చేయకపోవటం ఆమెను చాలా బాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేసినా కూడా ఆమెకు సరైన గుర్తింపులు దక్కలేదు. కానీ తమిళ ఫిలిం ఇండస్ట్రీ మాత్రంఆమెను అక్కున చేర్చుకుంది. అవార్డులు, రివార్డులు, సన్మానాలు ఇలా తమిళ ఫ్యాన్స్ ఆమెను బాగా ఆరాధించారు.

రాజశ్రీ లేకుండా సినిమా తీయటం అంటే అప్పట్లో కాస్త చాలెంజ్ అనే చెప్పాలి. అందుకే ఆమె కోసం ఏదో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేవారట. ఒకవేళ ఆమె డేట్స్ దొరక్కపోతే కనీసం ఓ స్పెషల్ సాంగ్ అయినా ఆమెతో చేయించేవారు. అలా బోలెడన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఆమె హిట్ సాంగ్స్ లిస్ట్ చాలా పెద్దది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News