Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుRajendra Nagar: తాళం వేసి ఉన్న ఇండ్లే వీరి టార్గెట్

Rajendra Nagar: తాళం వేసి ఉన్న ఇండ్లే వీరి టార్గెట్

భారీగా పట్టుబడిన బంగారు నగలు

రాత్రి పూట తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను మన షాద్ నగర్ పోలీసులు అరెస్ట్‌ చేశారు…కేసుకు సంబందించిన పూర్తి వివరాలను శంషాబాద్ డిసిపీ మీడియా ద్వారా వెల్లడించారు…షాద్ నగర్ పట్టణానికి చెందిన చెంది రామ్ రెడ్డి ఈనెల ఒకటిన తన కుటుంబంతో కలిసి వెళ్లడం జరిగింది.మళ్లీ తిరిగి రాగా ఇంట్లో మెయిన్ డోర్ తీసి చూడగా, లాకర్ పగలగొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.అందులో ఉన్నసుమారు రెండు లక్షల పదివేల రూపాయలు దొంగిలించినట్లుగా అనుమానించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిసిఎస్ శంషాబాద్ వారు సీసీ ఫుటేజీ పరిశీలించగా, రాజేష్ శంకర్ పవర్, పవన్ మచ్చింద్రలు దొంగిలించినట్లుగా తేలింది.

- Advertisement -

నిందితున్ని విచారించగా అతనితో పాటు మరో నలుగురు ఉన్నట్టుగా దర్యాప్తులో తేలింది…విచారణలో ఆసక్తి కరమైన విషయాలు…ఎలికట్ట,దూసకల్,బుజ్జిగూడ ప్రాంతాలలో పాటు వేరు వేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.వీరిపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో 05,కేసులు,మహేశ్వరంలో 2,పాడి షరీఫ్ -02, ఆమనగల్ -04, కేశంపేట -01,కొత్తూరు-01,నందిగామ-01,కడ్తాల్ -01, శంషాబాద్-03, కందుకూరు -02, మొత్తం 23 కేసులలో దొంగతనాలు చేసినట్లుగా విచారణలో వెల్లడించారు. ఎన్నికల వద్ద నుంచి సుమారు పై తులాల బంగారం, మిగతా పోలీస్ స్టేషన్ పరిధిలో నుండి సుమారు 20 తులాల బంగారంను స్వాధీన పరుచుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని తెలిపారు.

పలువురు సిబ్బందికి రివార్డులు అందజేసిన డిసిపీ

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దిశా నిర్దేశంతో డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో పోలీస్ శాఖలోని పలు విభాగాలకు చెందిన వారు మంచి పురోగతి సాధించారని డిసిపి నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు.

అడిషనల్ డిసిపి రామ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ డిసిపి నరసింహ, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, సిసిఎస్ ఏసిపి శశాంక్ రెడ్డి అదేవిధంగా షాద్ నగర్ ఏసిపి రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ సిఐ పవన్, సిఐ అవినాష్, డిఐ రామ్ రెడ్డి, సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో కేసును చేదించడం జరిగిందని విచారణ అధికారిగా డిఐ రాంరెడ్డి వ్యవహరించారని అదేవిధంగా కేసులో మోహన్, యాదగిరి, జాకీర్, రాజు, రఫీ తదితరులు కీలకపాత్ర పోషించారని వారికి డిసిపి నారాయణరెడ్డి చేతుల మీదుగా రివార్డులు అందజేశారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News