Friday, September 20, 2024
HomeదైవంGarla: కన్నుల పండువగా బొడ్రాయి నాభిశిల ప్రతిష్టాపన

Garla: కన్నుల పండువగా బొడ్రాయి నాభిశిల ప్రతిష్టాపన

ఊరంతా పాల్గొన్న ఉత్సవం

గార్లమండల పరిదిలోని గోపాలపురం గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ట తిరుపతమ్మ దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయంలో జీవద్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు రామశాస్త్ర ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మద్య పూర్ణాహుతి, హోమబలి హరణ, నిర్వహించి ఉరికి నాలుగు దిక్కుల ఎలాంటి శక్తులు రాకుండా బలిదాణం ఏర్పాటు చేశారు. గ్రామంలో చలువ పందిళ్లువేసి గ్రామ దేవతా మూర్తులకు ఉత్సవ విగ్రహలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. నిర్వహించారు. ఉరంతా తమ బందువులతో బొడ్రాయి ప్రతిష్టను వైభవంగా చేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది పోరిక బలరాం నాయక్, మండల నాయకులు వడ్లమూడి దుర్గాప్రసాద్, గుండా వెంకటరెడ్డి శీలంశెట్టి ప్రవీన్ కుమార్, భూక్య నాగేశ్వరరావు జడ్పిటిసి ఎంపీపీ బట్టు నాగరాజు ఝాన్సీ లక్ష్మి ఎంపీటీసీ ధనియాకుల రాజకుమారి అదేవిధంగా ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మేల్యే బానోత్ హరిప్రియా నాయక్ బిజెపి పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ గాజుల గణేష్ రాధాకృష్ణ సక్రు నాయక్ లు హజరై బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.. ఈ సందర్భంగా గ్రామంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News