కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని రేకుర్తి సర్వేనెంబర్ 47, 18వ డివిజన్ లో ఇంటి నెంబరు 2-1/1/1/1లో మేకల మౌనిక ఎలాంటి అనుమతులు లేకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని కరీంనగర్ కమిషనర్ కు దుర్గం మనోహర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ… అక్రమంగా నిర్మాణం చేపడుతున్న భవనానికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేవని అన్నారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
మున్సిపల్ ఆదాయానికి నష్టం చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి ఏఈ ఆకారపు నవీన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో కోరినట్టు చెప్పారు. అక్రమ ఇంటి నిర్మాణంపై గతంలో సిడిఎంఏ హైదరాబాద్ కు ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏఈ ఆకారపు నవీన్ గృహ నిర్మాణాల యజమానులతో కుమ్మక్కై అక్రమ లావాదేవులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కరీంనగర్ కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మనోహర్ కోరారు.