ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం కోసం నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ ను.. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయిల్ పామ్ సాగులో పారదర్శకత కొరకు యాప్, పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు నిరంజన్ రెడ్డి వివరించారు. ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని..పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయించినట్టు, ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 38 నర్సరీలు ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు.