Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభAbbas : ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు ఇలా హాస్పిటల్‌లో..

Abbas : ఒకప్పుడు స్టార్ హీరో.. ఇప్పుడు ఇలా హాస్పిటల్‌లో..

- Advertisement -

Abbas : 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా పాటలు అయితే ఇప్పటికి ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు అబ్బాస్. ప్రేమదేశం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అబ్బాస్ కి చాలా ఆఫర్స్ వచ్చాయి. తెలుగు, తమిళ్, మళయాలంలో హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలానే సినిమాలు చేశాడు. 2015 తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పి విదేశాలకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు.

అయితే అబ్బాస్ విదేశాలకి వెళ్లినా, సినిమాలని వదిలేసినా అప్పుడప్పుడు తన ఫేస్ బుక్ ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉన్నాడు. తాజాగా అతడు ఓ సర్జరీ చేయించుకున్నట్లు ఆసుపత్రిలో ఉన్న ఫోటోని తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.

అబ్బాస్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసి..”నేను హాస్పిటల్ లో ఉన్నాను. సర్జరీ ముందు కొంచెం భయపడ్డాను. కానీ నా సర్జరీ బాగానే జరిగింది. మీ అందరి ప్రేమ వల్ల నేను బాగున్నాను. త్వరలోనే ఇంటికి వెళ్తాను” అని పోస్ట్ చేశాడు. తన కాలికి సర్జరీ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఏం సర్జరీ అంటూ అభిమానులు, ప్రేక్షకులు ఏం జరిగిందంటూ ఆరా తీస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News