Saturday, November 23, 2024
HomeతెలంగాణErrabelli: పల్లెకు పట్టం కట్టిన బడ్జెట్..మంత్రి ఎర్రబెల్లి హర్షం

Errabelli: పల్లెకు పట్టం కట్టిన బడ్జెట్..మంత్రి ఎర్రబెల్లి హర్షం

రాష్ట్ర బడ్జెట్ లో 31,426 కోట్ల రూపాయలు కేటాయించి పంచాయతీ రాజ్ శాఖకు సింహ భాగం కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని మంత్రి అభివర్ణించారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్ మోడల్ గా మారాయని, అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయి అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో 13 జాతీయ అవార్డులు సాధించాం అన్నారు. 4,209 కోట్ల రూపాయలతో 8,160 కిలో మీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను చేపట్టి రవాణా వ్యవస్థను గొప్పగా అభివృద్ది చేశాం అన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో 2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
బడ్జెట్లో 31,426 కోట్ల రూపాయలతో పంచాయతీ రాజ్ శాఖకు అగ్రస్థానం ఇచ్చారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News