Nithya Menen : తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ నిత్యా మీనన్. వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. తాజాగా వండర్ వుమెన్ అనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది నిత్యా. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో విడుదలయింది. ఇందులో నిత్యా ప్రెగ్నెంట్ వుమెన్ గా నటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్య మీనన్ పెళ్లి గురించి మాట్లాడింది. ఇప్పటికే నిత్యాకి 34 ఏళ్ళు. చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి అడుగుతున్నారు. గతంలో ఓ కేరళ యూట్యూబర్ ని నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చినా వాటిని నిత్యా ఖండించింది.
తాజాగా వండర్ వుమెన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నిత్యా మీనన్ పెళ్లి గురించి మాట్లాడుతూ..”నేను మన సంప్రదాయాలని గౌరవిస్తాను కానీ పెళ్లంటే ఒక సోషల్, ఫైనాన్సియల్ సెటప్. లైఫ్ సెటిల్మెంట్ కోసం కొంతమంది పెళ్లి చేసుకుంటారు. అలాంటి సెటప్ కోసం అయితే నాకు పెళ్లి అవసరం లేదు. ఎవరైనా అబ్బాయి అలా ఫైనాన్షియల్ సెటప్ కాకుండా అంతకు మించి పెళ్లి గురించి ఆలోచించే వాళ్ళు దొరికితే అప్పుడు పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను. అప్పటిదాకా నేను పెళ్లి చేసుకోను” అని తెలిపింది. దీంతో పెళ్లి అంటే కేవలం డబ్బుతో ముడిపడి ఉంటుంది అని నిత్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.