Friday, September 20, 2024
HomeతెలంగాణJanagam: పల్ల గిల్లా …నైజాంత

Janagam: పల్ల గిల్లా …నైజాంత

బూర నర్సయ్య గౌడ్ గాలికి కొట్టుకుపోతాడు..

జనగాం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు ఎంఎల్ఏ, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని.. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ ధూంధాంగా సాగింది. జనగాం జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ….

“ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పైరవీలు చేసుకునే పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రజల మధ్యలో ఉంటాడా అని అన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో ధరణి పేరుతో లక్షల కోట్లు దోచుకుని తెలంగాణ రాష్ట్రానికి అప్పులపాలు చేశారని చెప్పారు. యువకుడు తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీకోసం అర్ధరాత్రి నాపరాత్రేనా అందుబాటులో ఉంటాడు. 2009లో నన్ను భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జనగామ ప్రజల గొంతు వినిపించే అవకాశం కల్పించారు అదేవిధంగా నేడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియంత కెసిఆర్ పాలనకు చర్మ గీతం పాడినట్లే మోడీ పాలను కూడా ప్రారదోలాలని అన్నారు. 30 రోజులు కష్టపడి ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలను వివరించి ప్రజలకు విస్తృత స్థాయిలో తెలియపరచాలని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపే జనగాం ప్రజలు ఉన్నారు కానీ మాయ మాటలు చెప్పి కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుకునే బిజెపి పార్టీ బూర నర్సయ్య గౌడ్ వైపు లేరని అన్నారు. రెండు చేతులు జోడించి అడుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ తో గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి గిఫ్టుగా ఇవ్వా”లని కోరారు.

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

“భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పార్లమెంట్ ఇన్చార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ కుల మత తారతమ్యాలు లేకుండా ఐక్యమత్యంతో అందరిని కలుపుకొని భేదాభిప్రాయాలు లేకుండా నేను మీకు సేవ చేస్తానని వాగ్దానం చేశారు.

తనపై నమ్మకం ఉంచి భువనగిరి టికెట్టు ఇచ్చిన ఎఐసిసి అగ్రనాయకత్వానికి మరియు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ ముందుకు వెళుతుందన్నారు. 30 సంవత్సరాలు ఎన్ఎస్యుఐ ,యూత్ కాంగ్రెస్ లలో కష్టపడితే ఏఐసీసీ అగ్రనాయకత్వం రాష్ట్ర నాయకత్వం కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిందని అన్నారు. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ తిరిగి నడయాడిన నేల మమకారం ఉన్న నేల ఈ జనగాం నేల” అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ..
డిసిసి అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు,భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ,మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గారు,పార్లమెంటు నియోజకవర్గ జనగామ ఇన్చార్జి భవాని రెడ్డి గారు, టి పి సి సి అధికార ప్రతినిధి బాల లక్ష్మి గారు,సీనియర్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ,జడ్పిటిసిలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల నుండి సర్పంచ్ లు, ఎం పి టి సి లు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News