తెలుగుదేశం,జనసేన, భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నైట్ స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, మంగళిగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్ రఘుపతిరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ టి సురేంద్ర కుమార్,కాపుసంఘం యువజన విభాగం అధ్యక్షుడు పెండ్యాల వెంకటరమణ.
కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పాార్టీ గుంటూరు లోక్సభ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్య, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్ధి మురుగుడు లావణ్య పాల్గొన్నారు.