Saturday, November 23, 2024
HomeఆటGandipeta: సీజన్-5 క్రికెట్ టోర్నీ నిర్వహించిన అంబేద్కర్ యూత్ అసోసియేషన్

Gandipeta: సీజన్-5 క్రికెట్ టోర్నీ నిర్వహించిన అంబేద్కర్ యూత్ అసోసియేషన్

ఛాంపియన్ గా అమీన్పూర్ టీం

యువత చదువుతో పాటు క్రీడా రంగంలోనూ రాణించాలని నార్సింగి మున్సిపాలిటీ చైర్ పర్సన్ రేఖ యాదగిరి అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగుల పల్లి గ్రామంలో గత వారం రోజులుగా అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నిర్వహించిన సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరగగా మ్యాచ్ లో అమీన్పూర్, హాఫిజ్ పెట్ జట్లు హోరాహోరీగా పోటీ పడగా ఫైనల్ గా అమీన్పూర్ జట్టు విజేతగా గెలిచింది. హఫీజ్ పేట్ జట్టు రన్నర్ గా నిలిచాయి.

- Advertisement -

విజేత అమీన్పూర్ జట్టుకు 40000 ప్రైజ్ మనీ-ట్రోఫీ, రన్నర్ జట్టుకు 20,000 ప్రైజ్ మనీ-ట్రోఫీని చైర్ పర్సన్ రేఖ యాదగిరి, మాజీ ఎంపీటీసీ నాగేష్ యాదవ్ కలసి ఇరు జట్లకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ టోర్నమెంట్‌ దోహదం చేస్తుందని అన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగి గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. నేటి గెలుపును భవిష్యత్తుకు బంగారు బాటలుగా మలుచుకోవాలని, ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ గెలుపుకు ప్రయత్నం సాగించాలని మాజీ ఎంపీటీసీ నాగేష్ యాదవ్ యువకులకు సూచించారు.

టోర్నమెంటుకు సహకరించిన బి విష్ణువర్ధన్, ఎం ప్రదీప్ కుమార్లకు అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ బి విక్రమ్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి ప్రభాకర్, ప్రేమ్ కుమార్, డి మహేందర్ పి భాస్కర్, యాదయ్య సుభాష్, సాయికుమార్, పి ప్రేమ్ కుమార్, పి శ్రీనివాస్ డి శ్రీను పి సురేష్ ఎన్ మహేందర్, యువకులు ఇరు జట్ల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News