తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కలిసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు. రామకృష్ణంరాజును ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.
తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు ఎన్ గణేష్ బాబు, మనవడు ఎన్.గణపతిరావులు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత వడ్లమూడి గంగరాజు.
తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ పౌండర్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య మాదిక, మాదిగ మహాసేన పౌండర్ ప్రెసిడెంట్ కె ప్రేమ్ కుమార్, ఏపీ మానవహక్కుల కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ జి.శ్రీనివాస్, మాదిగ ఇంటలెక్ట్యువల్ ఫోరమ్ ప్రతినిధి జి బాపిరాజు, దళితసేన ప్రతినిధి రావి ప్రకాష్ లు. ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్.
గోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కోనసీమ ముఖద్వారంలో పోటెత్తిన జనప్రహావం. రావులపాలెంలో జనగోదారి. కోత్తపేట నియోజకవర్గం రావులపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు మండుటెండలోనూ ముఖ్యమంత్రి వైయస్.జగన్ కు ఘనస్వాగతం పలికిన గోదావరి ప్రజలు.
తమ అభిమాన నేత కోసం బారులుతీరిన పసిపిల్లలు తల్లులు సహా, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదాతలు. బస్సుయాత్రలో కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రితో పాటు కదిలిన యవత. రావులపాలెం ప్రధాన రహదారిలో రోడ్డుపై బారులు తీరిన మహిళలు, యువత.