నీటి ఎద్దడితో రాష్ట్రమంతా అల్లాడుతోంది. గుక్కెడు నీటి కోసం విలవిలలాడుతుంటే ఇక్కడి మాత్రం నీరు వృథాగా పోవటం అందరికీ షాక్ ఇచ్చింది. మొగిలిపేట గ్రామంలోని తండా వద్ద మూడు రోజుల క్రితం మిషన్ భగీరథ పైపు పగిలి రోడ్డుపై వృధాగా నీరు ప్రవహిస్తోంది. నీరు వృధా అవుతున్నా అధికారులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. మూడు రోజులుగా రోడ్డుపై వృధాగా నీరు పోతున్నా మిషన్ భగీరథ అధికారులు చూసీ చూడనట్టు స్పందించకపోవడం గమనర్హం.
మూడు రోజుల నుండి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించడం లేదని, అక్కడ ఏర్పడ్డ గుంతలో ఎవరైనా ప్రమాదవశాత్తు అందులో పడితే ఎవరు బాధ్యులని తండా వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మేల్కొని సమస్య పరిస్కారం చేయాలని తండా వాసులు కోరుతున్నారు.