స్వయంకృషితోనే ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగవచ్చని ఆ దిశగా కష్టపడి తమ ఆర్థిక పురోగతి సాధించుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండల ఖానాపూర్ గ్రామ పంచాయతి పరిధిలోని కర్కాస్ తాండ మాజీ సర్పంచ్ శారద-శంకర్‌లు స్వయంకృషితో ఒక నూతన ఇండస్ట్రీస్‌కి శ్రీకారం చుట్టారు.
ఈ హెచ్డిపివి పైప్ నూతన ఇండస్ట్రీని కల్వకుర్తి శాసనసభ సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంకృషితోనే ఉన్నతంగా ఎదగవచ్చని ప్రతి ఒక్కరూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, మన మాజీ సర్పంచ్ శారద శంకరులు నిరూపించారని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక పరిశ్రమకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వశక్తితో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీస్ యాజమాన్యం అతిథులను శాలువాతో సత్కరించి ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, సింగిల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, ఖానాపూర్ ఎంపిటీసి సరిత గణేష్ గుప్తా, మాజీ ఎంపిటీసి దాసరి యాదయ్య, మాజీ సర్పంచులు వెంకట్రాంరెడ్డి, లలిత జ్యోతయ్య, శ్రీశైలం, రఘుపతి నాయకులు యాదయ్య గౌడ్, మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తా, రేణు రెడ్డి, డేవిడ్, బిఛ్య నాయక్ తదితరులు ఉన్నారు.