పోటీ తత్వాన్ని రెట్టింపు చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆటలను రోజూ కనీసం రెండు గంటలసేపైనా ఆడితే చాలా మంచిదని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ స్పోర్ట్ ఫన్-2023 కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి క్రీడలకు చాలా ప్రాధ్యానత ఇస్తారని గసిరెడ్డి అభినందించారు. చాలా మంది క్రీడలకు దూరమవ్వడం వల్ల మానసిక, శారీరక అనారోగ్యానికి బలవుతున్నారని ఆయన అన్నారు.
వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఖో-ఖో, కబడ్డి, త్రోబాల్, వాలీబాల్, ఫుట్బాల్, వెట్బాల్, మ్యూజికల్ చేర్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, పరుగుపందెం, టెన్నికాయిట్ తదితర క్రీడా పోటీలను ఏర్పాటు చేసినట్టు డాక్టర్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.