మార్చి 2024 ఇంటర్మీడియట్ ఫలితాలలో గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని కళాశాల ప్రిన్సిపల్ రూపన్ గోవిందరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023 24 సంవత్సరంలో చదివిన విధ్యార్దులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. వారిలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండియర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఎంపీసీ కె దివ్యశ్రీ 941/1000 బైపిసి ఎన్ చందన శ్రీ 912/1000 ఎంపీసీ జై భార్గవి 899/1000 ఎంపీసీ జి ఉషశ్రీ 889/1000 సెకండ్ ఇయర్ లో మొత్తం హాజరైన విద్యార్థులు 86 వీరిలో ఉత్తీర్ణత సాధించిన వారు 59 మంది విద్యార్థులని కళాశాల ఉత్తీర్ణత శాతం 69 శాతం గా ఉందని తెలిపారు.
ప్రథమ సంవత్సరం విధ్యార్దుల పలితాలలో భాగంగా ఎంపిసి టి శ్రీజ 446/470 సీఈసీ వి సాయి 399/ 500 ఎంపిసి కే కృతజ్ఞ 395/470 సీఈసీ కే మోనాలిసా 3 91/ 500 ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం హజరైన విధ్యార్దులు సంఖ్య 84 మందికి గాను 41 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణత 49.% ఉందన్నారు.
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు. అభినందించిన వారిలో రవీందర్ శ్రీనివాస్ జోగ్యా ప్రసాద్ సోమన్న తదితరులు ఉన్నారు.